రుచిగా ఉందని మయోన్నైస్ తింటున్నారా.. అయితే ఈ జ‌బ్బులు ఖాయం!

మయోన్నైస్.( Mayonnaise ) ఇటీవ‌ల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు.

ఫ్రెంచ్ ఫ్రైస్, నగెట్స్, గ్రిల్ చేసిన వెజిటబుల్స్ మరియు ఇతర స్నాక్స్ కోసం మయోన్నైస్ ను డిప్‌లా ఉప‌యోగిస్తున్నారు.అలాగే సలాడ్ డ్రెస్సింగ్‌గా, సాండ్విచ్ మ‌రియు బర్గర్లలో స్ప్రెడ్‌గా, వంటలో బైండింగ్ ఏజెంట్‌గా కూడా మయోన్నైస్ విస్తృతంగా ఉపయోగించ‌బడుతోంది.

రుచిగా ఉండ‌టం వ‌ల్ల పెద్ద‌లే కాకుండా పిల్ల‌లు కూడా మయోన్నైస్ ను ఎంతో ఇష్ట‌ప‌డుతున్నారు.అయితే మయోన్నైస్ వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య లాభాలు త‌క్కువే.

కానీ న‌ష్టాలు మాత్రం చాలా ఎక్కువ‌.గుడ్డు ప‌చ్చ‌సొన‌, సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్, వెనిగర్, ఉప్పు, చ‌క్కెర వంటి ప‌దార్థాల‌తో మ‌యోన్నైస్ ను తయారు చేస్తారు.

Advertisement

మయోన్నైస్‌లో క్యాలరీలు( Calories ) అధిక మొత్తంలో ఉంటాయి.కేవ‌లం ఒక టేబుల్ స్పూన్‌కి సుమారు 90 నుంచి 100 క్యాలరీలు ఉంటాయి.

అందువ‌ల్ల త‌రచుగా లేదా ఎక్కువ‌గా మ‌యోన్నైస్ తింటే ఒంట్లో కొవ్వు పెరిగి ఊబకాయానికి( Obesity ) దారితీస్తుంది.

ఎగ్ ఎల‌ర్జీ ఉన్న‌వారు మయోన్నైస్ తింటే స్కిన్ రాషెస్, వాంతులు, లేదా ఇతర అలెర్జిక్ రియాక్షన్స్ త‌లెత్త‌వ‌చ్చు.బ‌య‌ట దొరికే మయోన్నైస్ లో ట్రాన్స్ ఫ్యాట్ మరియు అధిక ప్రాసెస్డ్ ఆయిల్స్ ఉండొచ్చు, ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి.అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ కారణంగా గుండె సంబంధిత సమస్యలు( Heart Problems ) రావచ్చు.

అలాగే కొన్ని బ్రాండ్స్ వారు మ‌యోన్నైస్ లో అధిక సింథటిక్ ప్రిజర్వేటివ్స్ ను ఉప‌యోగిస్తారు.ఇవి పేగు సంబంధిత స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతాయి.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

మ‌యోన్నైస్ లో ఉండే అధిక సోడియం కంటెంట్ హై బీపీ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.అలా అని మయోన్నైస్ పూర్తిగా ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని చెప్ప‌లేం.అయితే అధిక కొవ్వు, క్యాలరీలు, మరియు ప్రిజర్వేటివ్స్ కార‌ణంగా అది ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌లిగిస్తుంది.

Advertisement

అందుకే మయోన్నైస్ ను చాలా మితంగా తినాలి.అది కూడా ఇంట్లో ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ధ‌తిలో త‌యారు చేసుకున్న మయోన్నైస్ ను వాడితే ఇంకా ఉత్త‌మం.

తాజా వార్తలు