బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌!

బ్రెడ్‌.గ‌తంలో పేషెంట్లు మాత్ర‌మే తీసుకునేవారు.

కానీ, ప్ర‌స్తుత యాంత్రిక జీవితంలో దాదాపు చాలా మంది బ్రెడ్‌ను తినేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు.

బ్రెడ్‌తో ర‌క‌ర‌కాల వంట‌లు చేస్తుంటారు.

Side Effects Of Eating Bread In Breakfast! Side Effects, Eating Bread, Breakfast

అయితే బ్రెడ్‌తో ఏ వంటకం చేసినా సులువుగా అయిపోతుంది.అందుకే కొంద‌రు ముఖ్యంగా.

ఉద్యోగులు ఇత‌ర వంట‌కాలు వండుకునే స‌మ‌యం లేక‌.మార్నింగ్ బ్రెడ్‌నే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు.

Advertisement

బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ జామ్ ఇలా బ్రెడ్ వంటకాలు లాగించేస్తారు.కానీ, ఇలా బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్‌ను తీసుకోవ‌డం ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎందుకంటే, బ్రెడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల‌ శరీరానికి ఎటువంటి పోషణ అంద‌క‌పోగా.ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంది.

అవును, బ్రెడ్‌లో గ్లూటెన్ అనే ఆమ్లం ఉంటుంది.ఇది మెదడు‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మెద‌డుపై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌టం వ‌ల్ల డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు త‌లెత్తుతాయ‌ని అంటున్నారు.అలాగే బ్రెడ్‌లో ఉండే గ్లూటెన్ అనే ఆమ్లం వ‌ల్ల‌ జీర్ణ స‌మ‌స్య‌లు ముఖ్యంగా.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.అధిక రక్తపోటుకు మరియు గుండె జ‌బ్బుల‌కు దారి తీసే సోడియం బ్రెడ్‌లో అధికంగా ఉంటుంది.

Advertisement

దీంతో ప్ర‌తి రోజు బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె స‌మ‌స్య‌లు, హై బీపీ వంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.ఇక బ‌రువు త‌గ్గాలనుకునే వారు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

ఎందుకంటే, బ్రెడ్ లో త‌క్కువ కేల‌రీలే ఉన్న‌ప్ప‌టికీ.ప్ర‌తి రోజు తీసుకుంటే మాత్రం ఎక్కువ కేలరీలు తిసుకున్నట్టే అవుతుంది.

త‌ద్వారా బ‌రువు పెరుగుతారు.అయితే ప్ర‌తి రోజు కాకుండా.ఎప్పుడో ఒక‌సారి బ్రెడ్‌ను తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

సో.ప్ర‌తి రోజు బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్‌ను తీసుకోవ‌డం మానేస్తే మంచిది.

తాజా వార్తలు