సిద్ధు, సమంత కాంబోపై పెరుగుతున్న ఆసక్తి.. మూవీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి( Nandini Reddy ) మరో క్రేజీ జంటతో కొత్త సినిమాను తెరకెక్కించ బోతున్నారు.

ఇటీవలే అన్నీ మంచి శకునములే( Anni Manchi Sakunamule ) సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన నందిని రెడ్డి ఇప్పుడు ఆమె నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టింది.

ఈమె నెక్స్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) తో తీయబోతున్నట్టు కన్ఫర్మ్ చేసేసింది.మరి ఈ సినిమాలోనే సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, రూత్ ప్రభు( Samantha ) హీరోయిన్ గా నటించ బోతుంది అని టాక్ వినిపిస్తుంది.

సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.ముఖ్యంగా ఈమె విజయ్ తో చేసే ఖుషి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఈమె ఈ సినిమాకు కూడా ఓకే చేసినట్టు రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.

Siddhu And Nandini Reddys Film Update Details, Director Nandini Reddy, Anni Man
Advertisement
Siddhu And Nandini Reddy's Film Update Details, Director Nandini Reddy, Anni Man

ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసుకుందట.త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాకు బివిఎస్ రవి కథ అందించనున్నాడు.

ఇక ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, సమంత కాంబో నటిస్తున్నారు అని తెలిసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ కాంబో ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.

సమంత ఉండడంతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగి పోతుంది.సిద్ధూకు కూడా యూత్ లో మంచి క్రేజ్ ఉంది.

అందుకే ఈ లంబోపై యువత బాగా ఆసక్తిగా ఉన్నారు.

Siddhu And Nandini Reddys Film Update Details, Director Nandini Reddy, Anni Man
న్యూస్ రౌండప్ టాప్ 20

కుటుంబ కథ చిత్రాలతో అలరించే నందిని రెడ్డితో సిద్ధూ నటించడం విశేషం.ఇప్పటికే సమంత, నందిని రెడ్డి కాంబోలో ఓ బేబీ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.దీంతో వీరి రెండవ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

Advertisement

చూడాలి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుందో.

తాజా వార్తలు