రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఢీ షో ( dhee 15 )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఇప్పటికే 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఢీ షో ప్రస్తుతం ఢీ 15షో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ లు కామెడీలతో ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే డి15 షో కి జడ్జిలుగా శేఖర్ మాస్టర్,శ్రద్ధా దాస్ ( Shekhar Master, Shraddha Das )లు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇక యాంకర్ గా ప్రదీప్( Pradeep ) వ్యవహరిస్తుండగా బిగ్ బాస్ జెస్సీ, యంగ్ యాంకర్ దివ్య నార్ని టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఢీ షోలో కూడా కాస్త బోల్డ్ కామెంట్స్ డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ అయ్యాయని చెప్పవచ్చు.
కాగా ఏప్రిల్ 26న ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ప్రతి ఎపిసోడ్లో కూడా బిగ్ బాస్ జెస్సి పై కామెంట్స్ చేస్తూ అందరూ అతని టార్గెట్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా జెస్సి పై జడ్జ్ శ్రద్ధాదాస్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజెన్స్ ఆమెపై మండిపడుతున్నారు.ఇంతకీ ఆ ప్రోమోలో ఏముంది ఆమె ఏం కామెంట్స్ చేసింది అన్న విషయానికి వస్తే.
ఎప్పటిలాగే కంటెస్టెంట్లు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు.ఇంతలో బిగ్ బాస్ జెస్సీ యాంకర్ దివ్యని( Anchor Divya ) ఫ్లటింగ్ చేస్తూ ఎంట్రీ ఇస్తాడు.
దివ్యకి బాగా చలిగా ఉందట వెచ్చదనం ఇవ్వడం కోసం ఆమెకి దగ్గరగా ఉన్నానని జెస్సీ ఫన్నీగా సమాధానం ఇవ్వగా వెంటనే స్పందించిన శేఖర్ మాస్టర్ ఆమెకు వెచ్చదనం రావాలంటే ముందు మనలో వేడి ఉండాలి కదా సెటైర్ వేశాడు.దాంతో జెస్సీ తలదించుకోగా అందరూ నవ్వుకున్నారు.తర్వాత ప్రదీప్ ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఒకాయన కూర్చుని ఏడుస్తుంటాడు.
నువ్వు ఆ టైపా అని అంటాడు.ఏమనుకుంటున్నారు నా గురించి నేనేంటో మీకు తెలియదు అని గంభీరంగా అంటాడు జెస్సీ.
అప్పుడు నాకు తెలుసు అని శ్రద్దా దాస్ అనగా.చెప్పండి అని జెస్సి అడగడంతో వెంటనే శ్రద్దానువ్వు పూజకి పనికిరాని పువ్వు అట కదా అంటూ వల్గర్ గా జెస్సీపై జోకు వేస్తుంది.దాంతో జెస్సి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు.
జెస్సి పై శ్రద్ధాదాస్ చేసిన కామెంట్స్ కి అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.కానీ అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.
కామెంట్స్ చేయొచ్చు కానీ ఇలా వల్గర్ గా కామెంట్ చేయడం మంచిది కాదు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy