ఢిల్లీలో అర్ధరాత్రి ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు

ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సొంతం చేసుకుంది.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గెలుపు కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టిన ఎలాంటి ఖర్చు లేకుండా కేజ్రీవాల్ టీం అద్బుత విజయం అందుకుంది.

దీల్హి ప్రజలు ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు.అయితే ఆప్ గెలుపుని కొంత మంది బీజేపీ సానుబూతిపరులు జీర్ణించుకోలేకపొతున్నారు.

Shotsfired At Aap Mla Naresh Yadavs Convoy In Delhi-ఢిల్లీలో �

కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవలేకపోయినా రెండో స్థానంలో బీజేపీ నాయకులు మాత్రం ఈ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు సంబరాలలో మునిగిపోయారు.

అయితే ఇలాంటి సమయంలో ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి.ఆప్ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

Advertisement

ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కూడా నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ గుడికి వెళ్లివస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

దీనిపై ఆప్‌ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడతూ ఈ ఘటన జరగటం చాలా విచారకరం అని, దీనికి ఎందుకు, ఎవరు పాల్పడ్డారో అనే విషయం తనకి తెలియదని.అయితే పోలీసులు నిందితులని గుర్తిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరగటం ఢిల్లీలో ఇప్పుడు చర్చనీయం అంశంగా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు