టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ( Nagarjuna )సింపుల్ గా ఉంటూనే తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ది ఘోస్ట్ సినిమా ( The Ghost )ఫలితం షాకిచ్చిన తర్వాత నాగార్జున ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
నాగ్ కొత్త సినిమా కొరియోగ్రాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.నాగార్జున ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
త్వరలో బిగ్ బాస్ షో సీజన్7 మొదలుకానుండగా ఈ షో సీజన్7 గత సీజన్లకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది.అయితే నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్న అని పిలిచిన ఏకైక హీరో హరికృష్ణ కావడం గమనార్హం. సీతారామరాజు సినిమాలో ( Sitaramaraju )హరికృష్ణ, నాగార్జున కలిసి నటించారు.ఆ సినిమా షూటింగ్ సమయంలో హరికృష్ణ, నాగార్జున మధ్య బంధం బలపడింది.ఒక సందర్భంలో నాగార్జున మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ( Jr ntr )మధ్య మంచి అనుబంధం ఉంది.
ఈ హీరోల కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.నాగార్జున సక్సెస్ రేట్ ఈ మధ్య కాలంలో తగ్గిందనే సంగతి తెలిసిందే.
యంగ్ హీరోల సినిమాల స్థాయిలో సైతం నాగ్ సినిమాలకు కలెక్షన్లు రావడం లేదు.
నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లతో గ్యారంటీగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.నాగ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉండగా నాగ్ పారితోషికం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.నాగార్జున తర్వాత సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.
నాగ్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.