రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్ లో తెరకెక్కిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా దర్శకుడు శరత్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదనే సంగతి తెలిసిందే.
అయితే ఈ డైరెక్టర్ మనకు కొత్త అయినా సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించడానికి మాత్రం కొత్త కాదు.కోలీవుడ్ ఇండస్ట్రీలో శరత్ మండవకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో శరత్ మండవ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడంతో పాటు కో 2 అనే సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు.ఈ సినిమా రంగం సినిమాకు సీక్వెల్ కావడం గమనార్హం.
కో 2 ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో తమిళంలో శరత్ కు ఎక్కువగా సినిమా ఆఫర్లు రాలేదు.రామారావ్ ఆన్ డ్యూటీతో శరత్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.
ఇప్పటికే విడుదలైన రామారావ్ ఆన్ డ్యూటీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అటు రవితేజకు ఇటు శరత్ కు ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ దొరుకుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
శరత్ గతంలో యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశారు.అయితే సినిమాలపై ఆసక్తి ఉండటంతో శరత్ మండవ దర్శకునిగా మారారు.
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రవితేజ మార్కెట్ ను పెంచుకుంటున్నారు.

రవితేజ ఒక్కో సినిమాకు 18 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.రవితేజ మార్కెట్ కు ఈ రెమ్యునరేషన్ ఎక్కువే కాగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే మాస్ మహారాజ్ రవితేజ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు భారీస్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.







