హాలీవుడ్ ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డ్ ఫీవర్ మొదలైందనే సంగతి తెలిసిందే.95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆర్.ఆర్.ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు అవార్డ్ వచ్చిందనే శుభవార్త వినాలని అభిమానులు భావిస్తున్నారు.లాస్ ఏంజిల్స్ (Los Angeles)లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుక జరగనుంది.
ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకునే అదృష్టవంతుల వివరాలు మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయి.అయితే ఆస్కార్ (Oscars)అవార్డుల వేడుకకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.అయితే ఆస్కార్ విజేతలకు డమ్మీ ఆస్కార్ అవార్డ్ ఇస్తారని చాలా మందికి తెలియదు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.
అవార్డ్ అందుకోవడానికి వేదికపైకి వచ్చే అతిథులకు మొదట డమ్మీ అవార్డ్ ఇస్తారు.
ఆస్కార్ అవార్డ్ ను అందుకునే వాళ్లు వేదికపై కొన్నిసార్లు తడబడటం జరుగుతుంది.అవార్డ్ వచ్చిందనే విషయాన్ని నమ్మడానికి కొంత సమయం పడుతుంది.అందుకే నామినేషన్ ను దక్కించుకున్న వాళ్లకు నిర్వాహకులు రిహార్సల్స్ చేయిస్తారు.
రిహార్సల్స్ సమయంలో వాళ్లకు డమ్మీ అవార్డ్ ను అందజేయడం జరుగుతుంది.విజేతలకు కంగారు తగ్గించడం కోసం ఈ విధంగా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది.
రేపు ఉదయం నిజమైన విజేతలకు ఆస్కార్ అవార్డులను అందజేయనున్నారు.ఆస్కార్ అవార్డ్ మన దేశం నుంచి ఎన్ని సినిమాలు సొంతం చేసుకుంటాయో చూడాలి.ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకోవడం ఎంతోమంది సినీ మేకర్స్ కల కాగా రాబోయే రోజుల్లో మరిన్ని భారతీయ(Indian) సినిమాలు ఈ అవార్డును సొంతం చేసుకుంటాయేమో చూడాల్సి ఉంది.ఆస్కార్ టార్గెట్ గా ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పై ఉన్నాయని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.