ఆ సినిమాలో చిరంజీవి ఫైట్ సీన్ కోసం ఆరు వేల కుండలు తెచ్చారట.. చివరకు?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తన సినీ కెరీర్ లో దాదాపుగా అన్ని రకాల పాత్రలను పోషించారు.ఏ పాత్రలో నటించినా చిరంజీవి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసేవారు.

 Shocking Facts About Chiranjeevi Aapadhbhandavudu Movie Details Here Goes Viral,-TeluguStop.com

చిరంజీవి సినీ కెరీర్ లో మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో ఆపద్భాందవుడు సినిమా( Aapadbandhavudu Movie ) కూడా ఒకటి.కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

మీనాక్షి శేషాద్రి( Meenakshi Seshadri ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది.అయితే ఈ సినిమాలో చిరంజీవి ఫ్యాన్స్ ను మెప్పించడం కోసం ఎద్దుతో ఫైట్ చేసే సన్నివేశాన్ని పెట్టారు.ఈ ఫైట్ సీన్ కోసం ఏకంగా 6,000 కుండలను తెప్పించారు.

ఈ కుండల కోసం ఏకంగా అప్పట్లోనే 50,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.ఈ సన్నివేశం షూటింగ్ పూర్తి కావడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టింది.

ప్రతిరోజూ కొన్ని కుండలు పగిలిపోతూ ఉండటంతో ఆ కుండల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త కుండలను పెట్టేవారు.ఈ ఫైట్ సీన్ లాస్ట్ డే షూట్ సమయానికి కుండలు దొరకని పరిస్థితి ఏర్పడింది.ఏం చేయాలో పాలుపోక ఆర్ట్ అసిస్టెంట్లు గ్రామాల్లో తిరిగి మరీ కుండలను తీసుకురావాల్సి వచ్చింది.ఆపద్భాందవుడు సినిమాకు ఈ ఫైట్ సీన్( Fight Scene ) హైలెట్ గా నిలవడం గమనార్హం.

1992 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమా అద్భుతంగా ఉందని క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి ఈ సినిమాకు చిరంజీవికి ఎన్నో అవార్డులు వచ్చాయి.

మరోవైపు చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీలో( Bhola Shankar ) నటిస్తున్నారు.ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది.భోళా శంకర్ మూవీ ఈ ఏడాది ఆగష్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube