తెలంగాణలో మోదీ పర్యటనకు ముందు బీజేపీకి షాక్

తెలంగాణలో ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

 Shock To Bjp Ahead Of Modi Visit To Telangana Details, Telangana, Bharatiya Jana-TeluguStop.com

ఈ మేరకు జూలై 2న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు.దీంతో బీజేపీ నేతల్లో జోష్ నెలకొంది.

అయితే ప్రధాని పర్యటనకు ముందు కమలం పార్టీకి షాక్ తగిలింది.నలుగురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

వీరంతా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్‌లను టీఆర్ఎస్ కండువాలు కప్పి కేటీఆర్ వారిని పార్టీలోకి స్వాగతించారు.

బీజేపీ నేతలు టీఆర్ఎస్‌లో చేరిన కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇటీవల బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Telugu Banothusujatha, Bjpghmc, Bjpnational, Etela Rajender, Ktr, Modi Hyderabad

అటు మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ రానుండగా సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరడం బీజేపీకి ఊహించని షాక్ తగిలినట్లు అయ్యింది.అయితే బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి ఆకర్షించడం వెనుక పలువురు ఎమ్మెల్యేలు కథ నడిపారని ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఈటల రాజేందర్ లాంటి సీనియర్లకు ఇది మింగుడుపడని పరిణామంగా మారింది.

Telugu Banothusujatha, Bjpghmc, Bjpnational, Etela Rajender, Ktr, Modi Hyderabad

కాగా ప్రధాని మోదీ సభకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అభిమానులను సభకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.తెలంగాణ రాష్ట్రంలో రైలు నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న నియోజకవర్గాల నుంచి, సుమారు 25 రైళ్లలో 50 వేల మందిని సభకు తర లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ప‌లు జిల్లాల నుంచి వచ్చేవారు శివార్లలో వాహనాలు పార్క్‌ చేసి.

మెట్రో రైళ్లలో సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, మోదీ సభకు తరలిరావాలని కోరుతూ సుమారు 10 లక్షల ఆహ్వాన పత్రికలను రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ స్థాయిలో పంపిణీ చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube