చాలాసార్లు మనం హీరోల గొంతులో నుంచి వచ్చే డైలాగ్స్ మాత్రమే వింటాం.కానీ ఆ డైలాగ్ చెప్పిన వ్యక్తి గురించి అంతగా ఆలోచించం.
తెరవైన కనిపించే పేస్ కి ఉన్న వ్యాల్యూ ఆ ఫేస్ కి డబ్బింగ్ చెప్పే వ్యక్తికి కనిపించదు.అతడు కేవలం వినిపిస్తారు అందుకే ఆ డబ్బింగ్ చెప్పిన వ్యక్తి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు.
కానీ కొన్నిసార్లు కొంతమంది నటీనటులకు పెద్ద పెద్ద హీరోలు సైతం డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉంటాయి.ఉదాహరణకు నటి సరితని తీసుకోండి.
సోనాలి బింద్ర నుంచి సౌందర్య వరకు చాలామంది టాప్ హీరోయిన్స్ కి ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు.అలాగే హీరోలలో శివాజీ( Hero Shivaji ) సైతం ఎంతో మంది నటులకు డబ్బింగ్ చెప్పారు.

సాయి కుమార్ అయితే అమితాబ్ నుంచి రాజశేఖర్ వరకు అందరికి డబ్బింగ్ చెబుతాడు.ఇక శివాజీ డబ్బింగ్( Shivaji Dubbing ) చెప్పిన కొన్ని వాయిస్ లు మనం అప్పుడైతే గుర్తుపట్టలేదు కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా గుర్తు పట్టగలం.ఎందుకంటే అతను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కన్నా హీరోగా ఫేమస్ బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) తర్వాత అది డబ్బింగ్ చేసిన పాత్రను కూడా చాలామంది గుర్తుపెట్టుకొని మరి వాచ్ చేస్తున్నారు.ఇంతకి కొన్ని అద్భుతమైన పాత్రలకు శివాజీ డబ్బింగ్ చెప్పాడు.
అవి ఏంటో తెలుసుకుందాం.దిల్ సినిమాల్లో నితిన్ కి( Nithin ) శివాజీ డబ్బింగ్ చెప్పేవాడు.
ఎందుకంటే మొదట్లో నితిన్ కి చాలా నత్తి ఉండేది.ఇప్పుడైతే అది కవర్ అయింది కానీ మొదట్లో అన్ని పాత్రలకు శివాజీ ని డబ్బింగ్ చెప్పేవాడు.
జయం సినిమాలో కూడా నితిన్ కి శివాజీ చేత డబ్బింగ్ చేపించుకున్నారు.

ఇక ప్రభుదేవా కి( Prabhudeva ) కూడా అందరూ దొంగలే సినిమాకి శివాజీ డబ్బింగ్ చెప్పాడు.ఈ వాయిస్ కూడా అతనికి అద్భుతంగా సూట్ అయింది.ఉల్లాసంగా ఉత్సాహంగా అంటూ యశోసాగర్ అద్భుతమైన ఒక సినిమాతో వచ్చి అర్ధాంతరంగా ముగిసిపోయాడు.
ఇక ఈ సినిమాలో శివాజీ అతని పాత్రకు డబ్బింగ్ చెప్పాడు.ఆర్యన్ రాజేష్( Aryan Rajesh ) సొంతం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తు తెచ్చుకున్నాడు.
ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ కి కూడా శివాజీనే డబ్బింగ్ చెప్పాడు.ఇక విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) నటించినా పిజ్జా సినిమాకి తెలుగులో శివాజీని డబ్బింగ్ చెప్పాడు.
ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు.ఇక ఉదయ్ కిరణ్ కి( Uday Kiran ) చిత్రం సినిమాకి కూడా మొదటగా డబ్బింగ్ చెప్పింది శివాజీనే.