టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న నటులలో చంద్రమోహన్ ఒకరు.చంద్రమోహన్ కు జోడీగా నటించిన హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు అప్పట్లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.లక్ ఉన్న హీరోలను సైతం స్టార్ హీరో అంటారని ఆయన తెలిపారు.
చంద్రమోహన్ కు వరుసగా సూపర్ డూపర్ హిట్లు వచ్చాయని అలా ఆయన స్టార్ హీరో అయ్యాడని ఇమంది రామారావు పేర్కొన్నారు.మొదట్లో చంద్రమోహన్ చిన్న సినిమాల్లో చేసినా తర్వాత కెరీర్ పరంగా ఎదిగారని ఆయన తెలిపారు.100 మందికి పైగా హీరోయిన్లను చంద్రమోహన్ పరిచయం చేశారని ఆయన పేర్కొన్నారు.శ్రీదేవి, రోజా రమణి, విజయనిర్మల ఆయన సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టారని ఇమంది రామారావు అన్నారు.

శివాజీ గణేషన్ ఒక సందర్భంలో నువ్వు ఒక్క అంగుళం ఉంటే మమ్మల్ని తినేసేవాడివి అని చంద్ర మోహన్ తో అన్నారని ఆయన కామెంట్లు చేశారు.చంద్రమోహన్ కొంచెం పొడవు ఉంటే స్టార్స్ కు గట్టి పోటీ ఇచ్చేవారని ఆయన తెలిపారు.చంద్రమోహన్ కు సినిమాలు ఎప్పుడూ ఉండేవని ఇమంది రామారావు అన్నారు.చంద్ర మోహన్ ఆస్తులు బాగానే సంపాదించారని ఆయన తెలిపారు.

చంద్రమోహన్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.చంద్రమోహన్ వయస్సు ప్రస్తుతం 77 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.చంద్రమోహన్ కు సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతుండగా ఆయన మళ్లీ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చంద్రమోహన్ మంచి హీరో అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం హీరోల తండ్రి, తాత పాత్రల్లో నటిస్తూ చంద్ర మోహన్ ప్రశంసలు అందుకుంటున్నారు.







