భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 1996 ధర్మపురి.తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.
టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్.ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.
ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు.గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 1996 ధర్మపురి.1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జగత్.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రత్యేకంగా నల్లరేణి కళ్ళధానా సాంగ్ పెద్ద హిట్ అయింది.
ఈ సినిమా విడుదల కానుంది.భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న 1996 ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్.
ధర్మపురి లో వుండే దొర గడిలో పని చేసే ఓ జీతగాడు.బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ 1996 ధర్మపురి.
అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కించారు చిత్రయూనిట్.హైరదాబాద్ లో పాత్రికేయుల సమక్షంలో ఈ సినిమాని ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
ఈ సందర్బంగా హీరో గగన్‌విహారి మాట్లాడుతూ.నేను సినిమా ఇండస్ట్రిలో చాలా సంవత్సరాలుగా నటుడు గా వున్నాను.
దర్శకుడు జగత్ గారు నాకు ఎప్పటినుండో స్నేహితుడు.ఆయన ఒకసారి ఈ పాయింట్ చెప్పి ఫ్రెష్ ఆర్టిస్టులతో చేద్దామని అనుకుంటున్నాను నువ్వు చేస్తావా అని అడిగారు.
విన్న వెంటనే చేయాలని అనుకున్నాను ఎందుకంటే ఇది చాలా మంచి కధ ఫ్రెష్ లోకేషన్స్ తో తీయాలని అనుకున్నారు.ఎందుకో ఈ కధ నన్ను ఆకట్టుకుంది.
విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ చేసే పాత్రలు చేసే నేను ఇప్పుడు లీడ్ పాత్రలో చేయడం ఎంతవరకూ కరెక్ట్ అనే ఆలోచన కూడా వచ్చింది.ఏది ఏమైనా తెలుగు కళామతల్లి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయెగించుకుని ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను.
ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వగానే ఇండస్ట్రిలోని పెద్దలు పాట చాలా బాగుంది హీరో , హీరోయిన్స్ చాలా బాగా చేశారు అని చెప్పారు.ఆడియన్స్ కూడా సాంగ్ ని పెద్ద హిట్ చేశారు.
మా యూనిట్ కి ధైర్యాన్ని ఇచ్చారు.తరువాత విడుదల చేసిన మరో రెండు సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం సోషల్ మీడియా లో రీల్స్ చేయడం, ఆన్‌లైన్ షోస్ లో సాంగ్ ప్లే చేయడం మరింత బూస్ట్ ఇచ్చింది.
ఇంత మంచి పాటలు కొరియోగ్రఫి చేసిన టాలీవుడ్ టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మా చిత్ర సమర్పకుడు కావడం మా యూనిట్ అదృష్టం.ఆయన సలహలు సూచనలు మా చిత్రానికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాయి.
అలాగే కంటెంట్ ని మాత్రమే నమ్మి ఎక్కడా కాప్రమైజ్ కాకుండా సినిమాని పూర్తిచేసి ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు ధియేటర్స్ లో తీసకువస్తున్న మా నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి గారికి నా ధన్యవాదాలు.ఈ చిత్రం తో పరిచయం అవుతున్న అపర్ణ దేవి తెలుగు సినిమా ప్రేక్షకుల హ్రుదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
దర్శకుడు జగత్ గతం లో చాలా పెద్ద పెద్ద కమర్షియల్ హీరోలతో పనిచేసారు.కథకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని చేయాలని అనుకుని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.1996 ధర్మపురి లో పాత్రలు మాత్రమే కనపడతాయి.ఆయన డిజైన్ చేసిన విధానం అందర్ని ఆకట్టకుంటుంది.
మ్యూజిక్ అందించిన ఓషో వెంకట్ ప్రాణం పెట్టాడు.అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ 22 న విడుదల చేస్తున్నాము.
అని అన్నారు.హీరోయిన్ అపర్ణ దేవి మాట్లాడుతూ.
నేను కేరళ నుండి వచ్చాను.నా మొదటి చిత్రం ధర్మపురి.
ఈ చిత్రంలో జగత్ గారు హీరోయిన్ పాత్రని డిజైన్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది.ప్రతి ఎమోషన్స్ లో వేరియేషన్ వుంది అదే నాకు చాలా బాగా నచ్చింది.
నా పాత్ర ప్రతి ఓక్కరి హ్రుదయాల్లో నిలిచిపోతుంది.గగన్ విహరి చాలా బాగా చేశారు.
జగత్ గారు , ప్రోడ్యూసర్ గారు నన్ను చిన్న పిల్లలాగా గారం చేశారు.మరిన్ని చిత్రాలు చేసేవిధంగా నాకు బ్లేస్సింగ్ ఇవ్వాలని కొరుకుంటున్నాను.
అని అన్నారు.నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి మాట్లాడుతూ.
మా మొదటి చిత్రం అయినా మా బ్యానర్ కి చాలా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను.మా బ్యానర్ ద్వారా ఓక మంచి హీరో , హీరోయిన్స్ ని ఇండస్ట్రికి పరిచయం చేస్తున్నాము, జగత్ గారు ఫ్యూచర్ లో చాలా మంచి దర్శకుడు అవుతారు.
ఈ చిత్రం ధర్మపురి లో మంచి లోకేషన్స్ లో జరుగుతుంది.మా చిత్రాన్ని తెలంగాణాలో ఎషియన్ ఫిలింస్ వారు, ఆంధ్రా లో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ వారు విడుదుల చేస్తున్నారు.
చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా మంచి సినిమా గా గుర్తించి ఈ చిత్రాన్ని ఒటిటి లో కాకుండా ధియోటర్స్ లోనే విడుదల చేయమని పెద్దలు కూడా చెప్పడం మా నమ్మకాన్ని పెంచింది.ఇది ఎవరూ ఊహించని కథ, కథనం దియోటర్స్ లో చూడటమే థ్రిల్ గా వుంటుంది.
బిజియస్ట్ కొరియోగ్రాఫర్ టాప్ పోజిషన్ లో వుండి మా కథ నచ్చి ఈ చిత్రం లో భాగమైన శేఖర్ మాస్టర్ మా ప్రత్యేఖ ధన్యవాదాలు.ఇప్పటి దాకా విడుదలయిన సాంగ్స్ చాలా పెద్ద హిట్ చేశారు.
ఇదే కాన్ఫిడెంట్ తో ధియోటర్ కి రండి మా కంటెంట్ పది రెట్లు మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.చాలా మంచి చిత్రాన్ని చేశాము.
అని అన్నారు.దర్శకుడు జగత్ మాట్లాడుతూ.
నేను చాలా పెద్ద చిత్రాలు, సూపర్‌హిట్ చిత్రాలు చేశాను.దర్శకుడు గా నా మోదటి చిత్రం కమర్షియల్ హీరో తో చేయాలని కథ మోదలు పెట్టాను.
కాని అనకొకుండా నిజామాబాద్ లో జరిగిన ఒక రియల్ స్టోరి రాసేసాను.అది నా బ్రైయిన్ లో వుండిపోయింది.
సరే కథ రాసేసాము ఇప్పడు ఈ కథ కి ఫ్రెఫ్ కాస్టింగ్ రియలిస్టిక్ గా వుంటే బాగుండు అనుకున్నాను.గగన్ విహరి, అపర్ణా దేవి లు నాకు వరం లా దొరికారు.
అలాగే అనుకొకుండా తెలంగాణా లోని ధర్మపురి కి వెళ్ళాను.అక్కడ ఇప్పటి వరకూ ఏ సినిమా తీయలేదు.
సినిమా షూటింగ్ చేస్తామనేసరికి అక్కడి ప్రజలు మమ్మల్ని వారి కుటుంబసబ్యులుగా భావించారు.అంతేకాదు ధర్మపురి లో నరసింహస్వామి చాలా పవర్‌ఫుల్.
ఆయన్ని దర్శనం చేసుకుంటే అర్ధమయ్యింది.ఈ కథ ధర్మపురి కి రావడానికి ఆయనే కారణం అని.ఆయన బ్లెస్సింగ్స్ తో శేఖర్ మాస్టర్ లాంటి టాప్ కొరియోగ్రాఫర్ మా సినిమా కి యాడ్ అవ్వటం.ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ పూర్తిచేసుకోవడం, మార్తాండ్ కె వెంకటేష్ లాంటి లెజెండరి ఎడిటర్ నువ్వు పాస్ అయ్యావ్ అని చెప్పడం చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను.
ఓషో వెంకట్ అందించిన సంగీతం చాలా మంచి ఆదరణ రావటం యూనిట్ కి ఊపిరోచ్చింది.మా కంటెంట్ పెద్దలు చూసి ధియోటర్ కి వెళ్ళండి అని చెప్పడం వారి సపోర్ట్ ఇవ్వడం, ఏప్రిల్ 22 న ఈ చిత్రం విడుదల చేయడం అంతా ధర్మపురి నరసింహ స్వామి బ్లెస్సింగ్స్ ,, ఈ చిత్రం లో పాత్రలు సినిమా చూసిన తరువాత మీతో ట్రావెల్ అవుతాయి.
ఈ చిత్రం మీ ఊహకు అందకుండా వుంటుంది.తప్పకుండా అందర్ని ఆకట్టకుంటుంది.ఈ చిత్రం మంచి విజయాన్ని సాదిస్తుంది.
అని అన్నారు.నటీనటులు: గగన్ విహారి, అపర్ణ దేవి, అఖండ నాగ మహేష్, పలాస జనార్దన్, కేశవ, నారాయణ స్వామి, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy