Sheep Distribution Scheme : గొర్రెల పంపిణీ పథకం స్కాం.. ఏసీబీకి విజిలెన్స్ నివేదిక

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం( Sheep Distribution Scheme ) కుంభకోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా పశు సంవర్ధక శాఖలో డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు( Vigilance officers ) పరిశీలించారు.

ఈ క్రమంలోనే పశు సంవర్ధక శాఖలో కీలక ఫైల్స్ మాయం అయ్యాయని అధికారులు గుర్తించారు.విజిలెన్స్ విచారణ అనంతరం అధికారులు ఏసీబీకి నివేదిక ఇవ్వనున్నారు.

కుంభకోణంలో మరో ఇద్దరు అధికారుల పాత్రను ఏసీబీ గుర్తించింది.అదేవిధంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్( Contractor Moinuddin ) కు సహకరించిన అధికారులను విచారించిన ఏసీబీ ఏడీ, జేడీ పాత్రపై కూడా ఆరా తీస్తుంది.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement