సూర్య రాకతో డిప్రెషన్ నుంచి బయటపడ్డా.. షణ్ముఖ్ జస్వంత్ కామెంట్స్ వైరల్?

షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యే వారికి ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సాఫ్ట్వేర్ డెవలపర్,సూర్య అనే వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ అదే పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

 Shanmuk Jaswanth Shocking Comments About Her Suryashanmukh Jaswanth, Hero Suriy-TeluguStop.com

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ కంటెస్టెంట్ సిరితో చనువుగా ఉండటం వల్ల ఏకంగా తన ప్రేమకు బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది.ఇలా దీప్తి సునయన ప్రేమలో ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ సిరితో చనువుగా ఉండడంతో దీప్తి సునయన తనకు బ్రేకప్ చెప్పారు.

ఇలా బ్రేకప్ అనంతరం షణ్ముఖ్ జశ్వంత్ కొద్ది రోజులపాటు ఏ విధమైనటువంటి వెబ్ సిరీస్ ల గురించి ప్రకటించలేదు.ఇకపోతే తాజాగా ఈయన నటించిన ఏజెంట్ ఆనంద్ అనే వెబ్ సిరీస్ యూట్యూబ్లో కాకుండా ఏకంగా ఆహాలో ఈనెల 22వ తేదీ నుంచి ప్రసారం కానుంది.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ ఈ వెబ్ సిరీస్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తాను బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత చేసే వెబ్ సిరీస్ యూట్యూబ్లో కాకుండా అహాలో ప్రసారమవుతుంది.

ఇలా తన వెబ్ సిరీస్ కు ఆహాలో అవకాశం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Telugu Sai Santhosh, Deepthi Sunaina, Suriya-Movie

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో మనసు తప్ప ఏదైనా వెతికి ఇచ్చేస్తాను అనే డైలాగ్‌ డైరెక్టర్‌ చెప్పమంటేనే చెప్పాను అంతకు మించి నాకేం తెలియదని చెప్పారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత కొన్ని రోజులపాటు తాను డిప్రెషన్ లో ఉన్నానని అయితే నా ఫేవరెట్ హీరో సూర్యను కలవగానే నాలో ఉన్న డిప్రెషన్ మొత్తం తొలగిపోయిందని అంతేకాకుండా నేను నటించిన సూర్య వెబ్ సిరీస్ నా ఫేవరెట్ హీరో సూర్య చూడటం మరింత ఆనందంగా ఉందని షణ్ముఖ్ జస్వంత్ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే షన్ను చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube