తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ( Director Shankar )ప్రస్తుతం ఒక వైపు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా ను రూపొందిస్తూనే మరో వైపు కమల్ హాసన్( Kamal Haasan ) తో గతం లో మొదలు పెట్టిన ఇండియన్ 2 ను మళ్లీ చేస్తున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం రెండు సినిమా లతో బిజీగా ఉన్న శంకర్ మరో వైపు బాలీవుడ్ లో అపరిచితుడు ఎప్పుడు చేస్తాడా అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

గతంలో తమిళం లో వచ్చి తెలుగు లో కూడా సూపర్ హిట్ అయిన చిత్రం అపరిచితుడు.ఆ సినిమా కు సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యం లో బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అంతా కూడా తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తూ ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు.ఇండియన్ 2.గేమ్ ఛేంజర్ సినిమా లు ఎప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు వస్తాయి అనేది క్లారిటీ లేదు.ఈ రెండు సినిమా లు విడుదల అవ్వకుండా కొత్త సినిమా ను మొదలు పెట్టడం అనేది శంకర్ కి సాధ్యం అయ్యే పని కాదు.అందుకే బాలీవుడ్ అపరిచితుడు సినిమా యొక్క హడావుడి ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది.
కానీ ఎప్పటికి పట్టాలెక్కేది మాత్రం స్పష్టత లేదు.

చాలా రోజులుగా సినిమా గురించి ప్రచారం జరుగుతోంది కానీ ఏ ఒక్కరు కూడా సినిమా గురించి క్లారిటీ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.అందుకే శంకర్ ఆ సినిమా ను చేస్తున్నాడా లేదా అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.ఆ విషయం లో స్పష్టత రావాలి అంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్( Ram Charan ) కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే.అంతే కాకుండా ఇండియన్ 2 సినిమా లో కమల్ హాసన్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే.
హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కు ఈ సినిమా అత్యంత కీలకం.శంకర్ కూడా గత సినిమా ల ఫలితాల నేపథ్యం లో ఈ సినిమా ల ఫలితాలపై ఆయన కెరీర్ ఆధారపడింది.