శని త్రయోదశి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ ఆరవ తేదీన శనివారం రోజు( Saturday ) త్రయోదశి వచ్చింది.

ఈ రోజు శనికి ఎంతో ఇష్టమైన రోజు అని పండితులు చెబుతున్నారు.

ఈ రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల శని ప్రభావం( Shani Effect ) నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.మనిషి చేసే పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనీశ్వరుడు గమనిస్తూ ఉంటారు.

బతికి ఉండగా చేసే పాపపుణ్యాలను శని పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తిగా వ్యవహరిస్తే మరణం తర్వాత పాపపుణ్యాల ఆధారంగా యమధర్మరాజు శిక్షలు అమలు చేస్తారు.అలాగే శని త్రయోదశి( Shani Trayodashi ) రోజు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శనివారం రోజు సూర్యోదయానికి ముందే తల స్నానం చేయాలి.

Advertisement

ఆరోగ్యం సహకరించే వారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి.శని త్రయోదశి రోజు మద్యం, మాంసాలు ముట్టుకోకూడదు.

శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా శని ప్రభావం తగులుతుంది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు.

ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి.మూగజీవులకు కూడా ఏదైనా తినిపించాలి.రోజుకో నువ్వుల ఉండను కాకికి( Crow ) తినిపించడం మంచిది.

శనివారం రోజు రొట్టెపై నువ్వులు వేసి కుక్కలకు పెడితే శని ప్రభావం తగ్గుతుంది.ఆంజనేయ స్వామి( Anjaneya Swamy ) ఆరాధన వల్ల శని ప్రభావం తగ్గుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024
చుండ్రును మాయం చేసి జుట్టును ఒత్తుగా మార్చే మ్యాజికల్ ఆయిల్ మీకోసం!

సుందరకాండ పారాయణం చేయాలి.కాలువలో కానీ, నదిలో కానీ, బొగ్గులు, నల్ల నువ్వులు, మెకు తీసుకొని శనికి నమస్కరించి వేయాలి.

Advertisement

బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పిడితే శని ప్రభావం దూరం అవుతుంది.ప్రతి శనివారం రాగి చెట్టుకు ప్రదక్షణం చేయాలి.

శనివారం రోజు శివాలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టి, నల్ల దుప్పటి దానం చేస్తే మంచిది.

తాజా వార్తలు