సుకుమార్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందా.. అదే సమస్య అంటూ?

మామూలుగా ఒక డైరెక్టర్ పెద్ద హిట్ కొట్టాడు అంటే అతనికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కచ్చితంగా పిలుపు వస్తుంది.

కానీ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా లాంటి పెద్ద సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్( Sukumar ) కి మాత్రం ఇప్పటివరకు బాలీవుడ్ హీరోల నుంచి కానీ బాలీవుడ్ నుంచి కానీ ఎలాంటి పిలుపు రాలేదు.

ఈ విషయం పట్ల అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అయితే చాలా వరకు సుకుమార్ అభిమానులను కాస్త నిరాశపరిచింది.

ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది.

Shahrukh Khan Movie With Sukumar Details, Sukumar, Shahrukh Khan, Bollywood, Tol

అదేమిటంటే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్( Shahrukh Khan ) నుంచి పిలుపు వచ్చిందని బాలీవుడ్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయట.పుష్ప 2 సినిమాలో సుకుమార్ టేకింగ్, మాస్ ఎలివేషన్స్ కు షారూక్ ఫిదా అయ్యాడట.దాంతో వెంటనే సుకుమార్ కి షారుక్ ఖాన్ కబురు పెట్టాడని, అలా ఇద్దరి కాంబినేషన్లో ఒక రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement
Shahrukh Khan Movie With Sukumar Details, Sukumar, Shahrukh Khan, Bollywood, Tol

కులవర్గ పోరాటాల నేపథ్యంలో ఆ సినిమా కథ సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా కథలు షారుక్ ఖాన్ అక్కడక్కడ నెగటివ్ ఛాయిల్లో కూడా కనిపిస్తాడట.

Shahrukh Khan Movie With Sukumar Details, Sukumar, Shahrukh Khan, Bollywood, Tol

అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టి ఎలా ఉంది.ఎందుకంటే ప్రస్తుతం సుకుమార్ రామచరణ్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.ఆ తర్వాత పుష్ప 3 సినిమా రానుంది.

ఈ రెండు సినిమాలు పూర్తవడానికి ఎంత లేదన్న కనీసం ఒక 5 ఏళ్ల సమయం పడుతుంది.ఈ రెండు సినిమాలు పూర్తయితే తప్ప షారుఖ్ సినిమాలో కదలికలు రావు.

నిజంగానే సుకుమార్ షారుక్ ఖాన్ కాంబినేషన్లో సినిమా వస్తుందా ఒకవేళ వస్తే ఎప్పుడు విడుదల కానుంది ఏంటి అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

హీరోతో డేట్ చేయకూడదని షరతు విధించారు.. నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు