తీరిన బాలీవుడ్ కల.. సూపర్ హిట్ తో కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్!

బాలీవుడ్ గత కొన్నాళ్లుగా హిట్ లేక సతమతం అవుతుంది.ఒకవైపు పక్క ఇండస్ట్రీలు అయిన మన సౌత్ భాషలు పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్స్ అందుకుంటూ 1000 కోట్ల ప్రాజెక్టులను మన ఖాతాలో వేసుకుంటుంటే బాలీవుడ్ మాత్రం 100 కోట్ల సినిమాలు కూడా చేయలేక ఘోరంగా విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.

 Shah Rukh Khan's Comeback With Pathaan, Pathaan, Shah Rukh Khan , Bollywood ,-TeluguStop.com

మరి అలాంటి తరుణంలో ఈ రోజు పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని బాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది.

నాలుగేళ్ళ గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు ”పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్.బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Telugu Bollywood, Pathaan, Shah Rukh Khan, Siddharth Anand-Movie

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది.ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది అని సరైన హిట్ లేక బాధ పడుతున్న షారుఖ్ కు మంచి హిట్ అందింది అని అంటున్నారు.

Telugu Bollywood, Pathaan, Shah Rukh Khan, Siddharth Anand-Movie

అలాగే బాలీవుడ్ కు సైతం బంపర్ హిట్ దొరికింది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఈ సినిమాను ముందు నుండి బాయ్ కాట్ చేయాలని ట్రోల్ చేసిన భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.దీంతో మంచి కంటెంట్ ఉంటే బాయ్ కాట్ సెగ కూడా సినిమాలను ఏం చేయలేదు అని నిరూపించింది.

మొత్తం మీద బాలీవుడ్ వర్గాలు ఈ సినిమా విజయంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇక ఇప్పుడు ఈ సినిమా ఎన్ని రికార్డులను గల్లంతు చేస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube