పాపం ఈ సీరియల్ నటి.. నిజజీవితంలో కూడా తండ్రి ప్రేమ దక్కలేదంటూ స్టేజిపైనే కన్నీళ్లు?

ప్రస్తుతం వెండితెరతో సమానంగా దూసుకుపోతుంది బుల్లితెర.ఎన్నో టీవీ సీరియల్స్, ఎన్నో రియాలిటీ షోస్, మరెన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రసారమవుతున్నాయి.

నిజానికి బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు ప్రేక్షకులు.అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ లు అందించడంతో బుల్లితెర బాగా దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెరపై స్టార్ మా పరివార్ అవార్డు ఫంక్షన్ జరగటంతో అందులో సీరియల్ నటి స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకుంది.ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఐశ్వర్య పిస్సే.

కన్నడ కు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు బుల్లితెరకు పరిచయమైంది.తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Advertisement
Serial Actress Aishwarya Pissa Emotional On Star Maa Pariwar Award Function, Ais

తన అందంతో కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.తెలుగుతో పాటు కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించింది ఐశ్వర్య.

కన్నడంలో పలు సినిమాలలో కూడా నటించింది.ప్రస్తుతం ఐశ్వర్య కస్తూరి సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సీరియల్ కంటే ముందు అగ్నిసాక్షి సీరియల్ లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఈ సీరియల్ తోనే అభిమానులను సంపాదించుకుంది.

ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో నిలిచింది.ఐశ్వర్య అల్లరి పిల్లగా బాగా పేరు తెచ్చుకుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

కేవలం సీరియల్ లోనే కాకుండా పలు ఈవెంట్లలో కూడా పాల్గొని తన డాన్సులతో బాగా రచ్చ చేస్తుంది.

Serial Actress Aishwarya Pissa Emotional On Star Maa Pariwar Award Function, Ais
Advertisement

ఇక కస్తూరి సీరియల్ లో తండ్రి కోసం ఆరాటపడుతున్న కూతురు పాత్రలో నటిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా స్టార్ మా పరివార్ అవార్డులో ఎమోషనల్ అయ్యింది ఐశ్వర్య.తనకు కస్తూరి సినిమా తరపున ఉత్తమ కూతురు అవార్డ్ అందుకుంది.

దీంతో ఆమె వేదికపై బాగా కన్నీరు పెట్టుకుంది.తన రియల్ లైఫ్ లో తన తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూడలేదు అంటూ.

తన తండ్రి ఉన్నాడు కానీ ఆ ప్రేమ దక్కలేదు అంటూ కన్నీరు పెట్టుకుంది.ఇక ఈమె ఎమోషనల్ సీన్ చూసి అందరు పాపం అని అనుకున్నారు.

దీంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కడున్న వాళ్లంతా విని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటల వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.ఇక ఐశ్వర్య సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

తొలిసారిగా తాను సినీ ఇండస్ట్రీకి కన్నడ సీరియల్ లో అడుగుపెట్టింది.సర్వమంగళ మాంగళ్య అనే సీరియల్ తో తొలిసారిగా తన నటన జీవితాన్ని ప్రారంభించింది.ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి అగ్నిసాక్షి సీరియల్ తో పరిచయమైంది.

ఇక ఈమె నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి అన్నయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్యకు తన భర్త సపోర్ట్ ఉండటంతో ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

తాజా వార్తలు