మణిపూర్ దాడులు పై ఆ రాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు..!!

దేశంలో మణిపూర్( Manipur ) లో జరిగినా అల్లర్లు ప్రపంచంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.రెండు తెగల మధ్య జరిగిన ఈ ఘర్షణలలో చాలామంది మరణించడం జరిగింది.

 Sensational Comments Of The State Cm On Riots In Manipur , N Biren Singh, Bjp, M-TeluguStop.com

దాడులలో కొంతమంది విధ్వంసకారులు ఆడవాళ్ళపై అత్యాచారాలకు కూడా పాల్పడటం జరిగింది.ఈ క్రమంలో ఇద్దరు ఆడవాళ్లను నగ్నంగా రోడ్డుపై ఊరేగించి ఆ తర్వాత… పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే.

ఈ ఘటన పట్ల ప్రపంచవ్యాప్తంగా భారత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.రాష్ట్రంలో జరుగుతున్న హింసకాండను మణిపూర్ ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయలేకపోయిందని తీవ్రస్థాయిలో విమర్శలు రావడం జరిగాయి.

ఇదిలా ఉంటే తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్( Biren Singh ).రాష్ట్రంలో జరిగిన అల్లర్లు హింసపై కీలక వ్యాఖ్యలు చేశారు.స్వార్థ ప్రయోజనాలు ఇంకా అపార్ధాలు, విదేశీ కుట్రల కారణంగా… మణిపూర్ రాష్ట్రంలో హింస జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు.

ఇదే సమయంలో జరిగిన హింసలో నష్టపోయిన కుటుంబాలకు…”ఒకే కుటుంబం ఓకే జీవనోపాధి” అనే ప్రాజెక్టు ద్వారా ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం బీరెన్ సింగ్.పేర్కొనటం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube