కెరీర్ ను కోల్పోయాను.. డిప్రెషన్, ఆర్థిక ఇబ్బందులు.. సీనియర్ నరేష్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు సీనియర్ నరేష్( Senior Naresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కొన్ని వివాదాల ద్వారా సీనియర్ నరేష్ వార్తల్లో నిలిచినా ఆయనను అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

 Senior Naresh Comment About Career Struggles Details, Senior Naresh, Vk Naresh ,-TeluguStop.com

విజయనిర్మల వారసుడిగా( Vijaya Nirmala ) సినిమాల్లోకి వచ్చిన సీనియర్ నరేష్ తన టాలెంట్ తో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు.తాజాగా నరేష్ కు అరుదైన గౌరవం దక్కిందనే సంగతి తెలిసిందే.

అయితే నరేష్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.తన గోల్డెన్ జూబ్లీ గురించి నరేష్ మాట్లాడుతూ నా లైఫ్ క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు ఈ పాట నాలో ఎంతో స్పూర్తి నింపిందని ఆ సమయంలో నేను కెరీర్ కోల్పోయానని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని నరేష్ చెప్పుకొచ్చారు.

ఇష్టమైన వాళ్లు శాశ్వతంగా దూరమయ్యారని సీనియర్ నరేష్ కామెంట్లు చేశారు.

బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని ఒక జోకర్ నాపై పనికిరాని కేసు వేసినా నాతల్లి, నా స్నేహితుడు విజయ్ మద్వా మాత్రమే సహాయం చేశారని నరేష్ కామెంట్లు చేశారు.100 కిలోల వరకు బరువుండే నేను ఇప్పుడిలా మారిపోయానని నరేష్ అన్నారు.ఈ పాట నాలో స్పూర్తిని నింపడమే కాదని నేను శక్తివంతంగా కమ్ బ్యాక్ ఇచ్చేలా చేసిందని నరేష్ కామెంట్లు చేశారు.

నేనిప్పుడు సినీ ప్రయాణంలో 50వ సంవత్సరంలో ఉన్నానని ఈ మైలురాయిని అందుకోవడంలో తోడ్పడిన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని నరేష్ కామెంట్లు చేశారు.పవిత్రతో( Pavitra Lokesh ) కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లిన ఫోటోలను సైతం నరేష్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.నరేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రముఖ నటుడు సీనియర్ నరేష్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube