తెలుగు సినీ ప్రేక్షకులకు సినీ నటుడు కోట శ్రీనివాసరావు ( kota srinivasa rao )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు ఎన్నో సినిమాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి నటుడిగా తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు.
హీరోలకు తండ్రిగా, తాత క్యారెక్టర్ లలో కూడా నటించాడు.ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు.
కాగా ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం కోట శ్రీనివాసరావు ఒకవైపు సినిమాల్లో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ వాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ శతజయంతి( Ntr satha jayanthi ) ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ వంటి వారిని ఘనంగా సత్కరించారు.సన్మానం అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ రోజు సినిమా అనేది లేనే లేదు.అంతా ఒక సర్కస్.
విషాద గీతాలకు కూడా డ్యాన్సులు చేస్తున్నారు.రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ , శోభన్ బాబు వంటి నటులు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా.

వాళ్లు ఎప్పుడూ కూడా తాము తీసుకున్న పారితోషికాన్ని బాహాటంగా చెప్పలేదు.అయితే ఇప్పుడున్న హీరోలు రోజుకి రూ.2కోట్లు, రూ.6 కోట్లు.40 రోజులకు రూ.80 కోట్లు అంటూ పబ్లిక్‌గానే చెబుతున్నారు.ఇది మంచి పద్దతి కాదు.అప్పట్లో రామారావు, శ్రీదేవీతో కలిసి డ్యాన్స్ చేస్తుంటే వయసు గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు.వాళ్లిద్దరూ ఎంత చక్కగా నటిస్తూ డ్యాన్స్ చేశారని అనేవారు.తాను ఇప్పుడు డ్యాన్స్ చేసే ముసలోడు డ్యాన్స్ చేస్తున్నాడని అంటారు అంటూ కోటా శ్రీనివాసరావు తనపై తానే పంచ్ వేసుకుని అక్కడ ఉన్నవారిని నవ్వించారు.
ఎంత మంది ఆర్టిస్ట్‌లు రెండు పూటలా కడుపు నిండా అన్నం తింటున్నారు అనే విషయంపై దృష్టి సారించాలని మా అసోసియేషన్‌కు సూచించారు.ఇది ఇలా ఉంటే కోట శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ ( Pawan klayan )ని ఉద్దేశించి ఆ విధంగా కామెంట్స్ చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక సందర్భంలో పవన్ ఒక వేదికపై తన పారితోషికం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.తనకి రోజుకి రెండు కోట్ల పారితోషికం ఇస్తున్నారని, 25 రోజులు కాల్షీట్లు ఇచ్చినట్లు తెలిపారు.
అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఇలా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.