ఇంటర్నెట్ అవసరం లేకుండా వాట్సాప్ చాటింగ్ ఇలా

వాట్సాప్, హైక్, వీ చాట్ ఇంకా ఎన్నో.అన్ని మెసెజింగ్ ఆప్ లే.

 Send Whatsapp Messages Without Internet-TeluguStop.com

వీటీని వాడుతూ సన్నిహితులతో రోజంతా ముచ్చట్లు పెడుతుంటాం.ముఖ్యంగా వేరే దేశాల్లో నివసించే స్నేహితులతో టచ్ లో ఉండాలంటే వీటి అవసరం ఎంతైనా ఉంది.

కాని ఒక మెసెజ్ పంపాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా ఇంటర్నెట్ కావాల్సిందే.ప్రతిచోట, ప్రతీసారి ఫోన్లో మొబైల్ డేటా ఉండాలన్నా, వైఫై దొరకాలన్నా జరిగే పని కాదు.మరేలా? ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ చాట్ చేయొచ్చా?

ఇంటర్నెట్ లేకుండా చాట్ చేయొచ్చు.టన్నులకొద్ది మెసెజెస్ పంపుకోవచ్చు.

ఇదేలా అంటే చాట్ సిమ్ ద్వారా.ఈ చాట్ సిమ్ అంటే ఏదో అప్లికేషన్ కాదు, ఇది మిగితావాటిలానే ఒక సిమ్.దీన్ని www.chatsim.com నుంచి బుక్ చెయొచ్చు.సైట్ లోని ప్రాసెస్ ఫాలో అవుతూ యాక్టివేట్ చేసుకోవచ్చు.సంవత్సరంపాటు చాట్ సిమ్ సేవలు పొందాలంటే ₹950 చెల్లించాలి

ఒక్కసారి ఈ సిమ్ ని మీ ఫోన్లో వేసుకున్నాక, వాట్సాప్, హైక్ లాంటి మెసెజర్ అప్ నుంచి ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేకుండా మెసెజ్ పంపుకోవచ్చు.150 దేశాల్లో ప్రస్తుతం ఈ చాట్ సిమ్ ని ఉపయోగిస్తున్నారు.
ఇక ట్విస్ట్‌ ఏంటంటే, చాట్ సిమ్ కొనుగోలుపై షిపింగ్, యాక్టివేషన్ చార్జెస్ అదనంగా పడతాయి.కాల్స్ చేసుకోవాలంటే సపరేట్ రిచార్జ్ చేసుకోవాలి.జియో సిమ్ సేవలను పొందుతున్నవారికి ఈ చాట్ సిమ్ ఏ కోశానా పనికిరాదు అనుకోండి.జియో సిమ్ లేక ఇబ్బందిపడుతున్నవారైతే ఓ లుక్కేసి చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube