హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా టచ్ అవుతుంది.. దర్శకురాలు జీవిత రాజశేఖర్

కొన్ని పరిస్థితుల వలన దర్శకురాలు అయ్యాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయాలనే జీల్ ఎప్పుడూ లేదు అన్నారు దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా.

 Sekhar Movie Director Jeevita Rajasekhar Interview Details, Sekhar Movie Directo-TeluguStop.com

రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శేఖర్”.ఈ చిత్రాన్ని వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ గారు ఇండియా వైడ్ విడుదల చేస్తుండగా నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర దర్శకురాలు జీవిత రాజశేఖర్ పాత్రికేయ మిత్రులతో ముచ్చటించారు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ట్రూ స్టోరీ “శేషు” మూవీ తెలుగు రైట్స్ కొన్నప్పుడు ఆ సినిమాను తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా తీయాలిని చాలామంది దర్శకులను కలవడం జరిగింది అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమాను రాజశేఖర్ గారికి తగ్గట్టు కొన్ని మార్పులు చేయాలి అన్నారు.

అయితే ఆ కథలో ఏ మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.దాంతో నేనే ఆ సినిమాకు దర్శకత్వం చేయాల్సి వచ్చింది.

దర్శకురాలిగా అది నా మొదటి చిత్రం.డైరెక్షన్ పరంగా ఏమీ తెలియకున్నా డిఓపి హరి సపోర్ట్ తో అంతా తెలుసుకొని ఆ మూవీ తీయగలిగాను.

ఆ తర్వాత నా సొంత సినిమాలకు దర్శకత్వం చేయడం జరిగింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమా మాకు నచ్చడంతో తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది.

ఈ సినిమాను “శేఖర్” పేరుతో తీయాలని పలాస డైరెక్టర్,నీలకంఠ గార్లకు కలవడం జరిగింది.వారు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కూడా నేనే దర్శకురాలిగా చేయడం జరిగింది.

Telugu Prakash Raj, Rajasekhar, Sekhar-Movie

చాలా రియలిస్టిక్ గా తీసిన “శేఖర్” సినిమా ఎవరు ఏక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది.ఇందులో తన లుక్ కు మంచి అప్లాజ్ వచ్చింది మన లాంగ్వేజ్ కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది .ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది

ప్రతి వ్యక్తి లైఫ్ లో మనకు చాలా ఇష్టపడే వ్యక్తి ఒకరు ఉంటారు.వారు తల్లి, తండ్రి,అక్క, చెల్లి, అన్నా ఇలా ఎవరైనా ఆవ్వచ్చు అటువంటివారెవరూ లేకుండా సింగల్ గా మిగిలి పోతే తన మైండ్, ఎమోషన్ ఎలా ఉంటుంది.

తన పక్కన ఎవరూ లేకున్నా ఒక కామన్ గా తనకు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేదే శేఖర్ సినిమా.హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా టచ్ అవుతుంది.

ప్రతి ఒక్కరి లైఫ్ లో “శేఖర్” ఉంటాడు అనేలా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

మేము గోరింటాకు తీసినప్పుడు కూడా ఈ సినిమాను యాక్సెప్ట్ చేస్తారా అనుకున్నాము కానీ.

సినిమా సెంటిమెంటు పరంగా చాలా బిగ్ హిట్ అయింది.ఆ ధైర్యంతోనే ఈ మూవీ చేసాము.

ఈ సినిమాను తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే కొన్నాము కాబట్టి తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాము.మంచి ఆఫర్ వస్తే ఓటిటిల్లో కూడా రిలీజ్ చేస్తాము.

ప్రకాష్ రాజు గారు చాలా మంచి మనసున్న వ్యక్తి తను చేసే సహాయము తన పక్క చేతికి కూడా తెలియనంతగా హెల్ప్ చేస్తాడు.తను ఈ సినిమా కొరకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేయడం జరిగింది.

మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ.యూట్యూబ్ వారే తంబ్ నెల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు.

Telugu Prakash Raj, Rajasekhar, Sekhar-Movie

రాజశేఖర్ గారూ శివాని ఇద్దరూ ఈ సినిమాలో ఉన్నా కుడా నేను నా క్యారెక్టర్ బాగా రావాలని వచ్చేవరకూ వారితో వర్క్ చేయడం జరుగుతుంది.ఈ మూవీలో డాటర్ కు చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉందని ఇద్దరు కూతుళ్ళు శివాని,శివాత్మిక చెప్పడం జరిగింది.అయితే శివాని చేస్తానని చెప్పడం జరిగింది.డాటర్ కి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొత్త అమ్మాయిను తీసుకొచ్చి వారి మధ్య డాటర్, ఫాదర్ రిలేషన్ బిల్డప్ చేయడం కంటే శివాని డాటర్ గా చేస్తే బాగుంటుందని తనతో చేయించడం జరిగింది.

ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు కూడా మేము చాలా టెన్షన్ పడ్డాము.నాచురల్ గా ఉన్న ఈ కథను ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అని.అయితే ట్రైలర్ రిలీజ్ కు ట్రైమెండస్ రెస్పాన్స్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాము.అలాగే చాలా కాలేజీలకు టూర్లకు వెళ్లడం జరిగింది.

దాంతో మాకు ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది.

వన్ వీక్ లో షూట్ స్టార్ట్ అవుతుంది అనగా రాజశేఖర్ గారికి కోవిడ్ రావడం జరిగింది.

ఆ తరువాత చాలా సీరియస్ అయి తను బతుకుతాడా.లేదా అనే స్టేజ్ కి వెళ్ళాము.

అందరి ఆశీర్వాదంతో తను రికవరీ అయ్యి ఈ సినిమా చేయడం జరిగింది.

రాజశేఖర్ గారు రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ & సెన్సిటివ్ ,వెరీ హ్యూమరెన్స్ పర్సన్.

కోపం వస్తే ప్రతి ఓక్కరు రియాక్ట్ అవుతాం.ఈ సినిమాలో కూడా తను నిజ జీవితంలో ఎలా ఉంటాడో అదే విధంగా ఈ సినిమా ఉంటుంది.

కామన్ మ్యాన్ కి ప్రాబ్లం వస్తే ఎం చెప్తాడు, కోపం వస్తే ఎం చేస్తాడు.అనేదే ఈ సినిమా.

రాజశేఖర్ గారు డైరెక్టర్ హీరో.తను ముందు ఏది ప్రిపేర్ అవ్వరు.సెట్ లో డైరెక్టర్ ఏది చెబితే అదే చేస్తాడు కోడి రామకృష్ణ సినిమా దగ్గరనుంచి ఇప్పటివరకు తను డైరెక్టర్స్ హీరో.అందులో తనకు ఇల్లాజికల్ అనిపిస్తే తను ఎంత పెద్ద డైరెక్టర్ సినిమా అయినా అది చేయడు.

Telugu Prakash Raj, Rajasekhar, Sekhar-Movie

అందరూ రాజశేఖర్ గారు నెగిటివ్ రోల్స్ చేస్తారా.అని అందరూ అడుగు తున్నారు.అయితే మొదట తన జర్నీ విలన్ గానే మొదలైంది.బారతి రాజా దర్శకత్వంలో విలన్ గా నటించాడు.తరువాత హీరో గా చేయడంతో బిజీ అయిపోయారు.అయితే రామ్ చరణ్ సినిమా “ధ్రువ” లోని అరవిందస్వామి లాంటి క్యారెక్టర్, పెదరాయుడు లోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి అన్ టచబుల్ క్యారెక్టర్ వస్తే కచ్చితంగా చేస్తాడు.

అలాగే చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చినా చేయడానికి తను సిద్ధంగా ఉన్నారు.అలాగే నన్ను కూడా సేమ్ కొశ్చన్ వేస్తున్నారు.

నాకు మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

సర్కారు వారి పాట,ఎఫ్ 3 సినిమాలు ఉన్నా మేము ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము.

మా సినిమాకు పెద్ద సినిమాలకి ఇచ్చిన టికెట్ రేట్స్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన రేట్స్ పరంగానే మా సినిమాకు టికెట్స్ ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కోరడం జరిగింది.అందుకు వారంతా ఒప్పుకున్నారు.

రాజశేఖర్ గారు నాకు అన్ని విధాలుగా ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ఈ రోజు అన్ని నేర్చుకోగలిగాను, ఎక్కడైనా ఒంటరిగా ధైర్యంగా మాట్లాడ గలుగుతున్నాను అంటే అది తన సపోర్ట్ ఉండడం వలనే.

“మా” లో నేను లేకపోయినా నాకు అందరూ టచ్ లో ఉన్నారు.ఎవరికీ ఏ హెల్ప్ కావాలన్నా నేను ముందుంటాను.అలాగే మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా “శేఖర్” సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వ దించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని ముగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube