ప్రజా రవాణా వాహనాలలో జంతువులు ఎక్కి ఆయా ప్రదేశాలకు ప్రయాణించడం కొత్తేం కాదు.ఇప్పటికే కుక్కలు, పిల్లులు వాటంతటవే వాహనాల్లో ఎక్కి ప్రయాణాలు చేసిన ఘటనలు వైరల్ అయ్యాయి.
తాజాగా ఒక పక్షి రైల్వే స్టేషన్ లో వెయిట్ చేసి ఓ ట్రైన్ ఎక్కి వెళ్లిన సంఘటన చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక ట్రైన్ స్టేషన్ కనిపించడం చూడవచ్చు.ఆ ట్రైన్ స్టేషన్ ఫ్లోర్ పై ఒక పక్షి వాలి ఉంది.అది ఒక హ్యూమన్ ప్యాసింజర్ వలే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఫ్లోర్ చివరి అంచున వాలి ఉంది.
అంతలోనైనా అటువైపు నుంచి ఒక ట్రైన్ వచ్చింది.ఆ ట్రైన్( train ) రాక చూసి పక్షి ఎగిరిపోలేదు సరి కదా అది దానిలోని ఒక బోగీ డోర్ ను ఫాలో అవుతూ నడుస్తూ ఉంది.
ట్రైన్ పూర్తిగా ఆగిన తర్వాత బోగీ డోర్ ఓపెన్ అయింది.ఆ పక్షి సరిగ్గా డోరు ముందుకు వచ్చి ఎగురుతూ బోగీ లోపలికి వెళ్ళిపోయింది.ఇది ఒక ప్యాసింజర్ వలే ప్రవర్తించిన తీరును మరో ప్యాసింజర్ వీడియో తీశాడు.ఈ వీడియోను @TheFigen_ అనే ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 52 లక్షల వ్యూస్ వచ్చాయి.20 సెకన్ల నిడివి గల ఈ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ఈ పక్షి( #Bird ) అలా ఎలా ప్రవర్తించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ పక్షి తన రెక్కల సహాయంతో ఎగిరి బాగా అలసిపోయినట్టుంది.అందుకే ఇలా ట్రైన్ లో ప్రయాణిస్తుంది అంటూ ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు.మరి ఈ పక్షికి టికెట్ ఎవరు తీసుకుంటారు? అని కొందరు ఫన్నీగా ప్రశ్నించారు.అది ఒక యానిమల్ ప్లానెట్ యాక్టర్ అయి ఉంటుంది.షూటింగ్ తర్వాత అలసిపోయి ఇలా ట్రైన్ లో ప్రయాణిస్తుందేమో అని మరికొందరు సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







