ఏపీ బీజేపీలో ( AP BJP )మరోసారి సీట్ల పంచాయతీ తెరపైకి వచ్చింది.పొత్తు నేపథ్యంలో ఆరు ఎంపీ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లను బీజేపీకి టీడీపీ అధిష్టానం కేటాయించింది.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తాను గెలవని సీట్లను బీజేపీకి కేటాయించారని బీజేపీ సీనియర్ నేతలు అధిష్టానానికి లేఖ రాశారు.పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరి కొన్ని సీట్లపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాళహస్తి, గుంటూరు వెస్ట్, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించడంపై మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి( Purandeshwari ) ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చింది.
మరోవైపు ఈనెల 21 లోగా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.







