తేళ్లతో పూజలు చేసే ఆలయం గురించి విన్నారా? అదెక్కడుందో తెలుసా?

దేవుడికి పూలు, పండ్లు, ఆకులు, కబ్బరి కాయలు వంటి వాటితో పూజలు ేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ ఆలయంలో మాత్రం తేళ్లతో పూజలు చేస్తుంటారు.

 అదేంటీ తేళ్లతో పూజలా అని ఆశ్చర్యపోతున్నారా.! అవునండీ ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని కొండపై ఉన్న కొండ రాయుడు ఆలయంలో ఇలాంటి పూజలు చేస్తుంటారు.

అక్కడి ప్రజలంతా పండుగ సమయాల్లో ఆలయానికి చేరుకుని తేళ్లకు దారాలు కడ్తారు. ఆ తర్వాత వాటితో స్వామి వారికి అభిషేకం చేస్తారు. అంటే స్వామి వారి మూల విరాట్టుపై వాటిని ఉంచుతారు.

 అవి కాసేపు స్వామి వారి విగ్రహంపై తిరుగుతాయి. ఆ తర్వాత వాటిని తమపై పెట్టుకుంటూ మసాజ్ చేయింకుంటారు.

Advertisement

 చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తేళ్లకు భయపడకుండా ఇలాగా చేస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ పూజలు ఎక్కువగా చేస్తుంటారు.

 ఆ మాసంలోని ప్రతీ సోమవారం కొండ రాయుడు ఆలయంలో ఇలా తేళ్తో అభిషేకం చేస్తుంటారు.అయితే శ్రావణ మాసంలో కొండ రాయుడు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.

 పట్టణంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా తేళ్లతో స్వామి వారిని అభిషేకించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

 అందుకే ఆలయానికి వచ్చి ప్రతీ భక్తుడు తేళ్లను తమ శరీరాలపై ఉంచుకొని విన్యాసాలు చేస్తుంటారు. నోరు, ముక్కు, చెవులు, చేతులు, చెంపలు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
న్యూస్ రౌండప్ టాప్ 20

 ఇలా అన్ని భాగాలపై తేళ్లను ఉంచుతుంటారు.

Advertisement

తాజా వార్తలు