ఖడ్గమృగం కొమ్ముల్లో రేడియోయాక్టివ్ మెటీరియల్ ఇంజెక్టు చేసిన సైంటిస్టులు..??

జంతువులను చంపడం, వన్యప్రాణుల వేట అనేది చాలా తీవ్రమైన నేరం.దీన్ని ఆపేందుకు ప్రపంచవ్యాప్తంగా చట్టాలున్నా, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ జరుగుతూనే ఉంది.

ఖడ్గమృగం( Rhinoceros ) కోసం వేటాడే వారిని అడ్డుకోవడానికి సౌత్ ఆఫ్రికన్‌ శాస్త్రవేత్తలు( South African scientists ) కొత్త పద్ధతిని ప్రయోగిస్తున్నారు.దక్షిణాఫ్రికాలోని పరిశోధకులు కొమ్ముల్లోకి రేడియోధార్మిక పదార్థాన్ని (మానవ శరీరానికి హాని లేనిది) ఇంజెక్టు చేస్తున్నారు.

దీంతో, ఖడ్గమృగాలు నడుస్తున్న అణుబాంబులుగా మారుతాయని చెప్పవచ్చు.ఈ విచిత్ర పద్ధతి వల్ల, ఖడ్గమృగం కొమ్ములు మనుషులు తినలేనివిగా మారి, వేటగాళ్లకు పనికిరాకుండా పోతాయి.

ఇప్పటివరకు ఇలా ఇరవై ఖడ్గమృగం కొమ్ములకు ఇంజక్షన్ ఇచ్చారు.ఈ కొమ్ముల్లో వాడిన రేడియోధార్మిక ఐసోటోప్‌లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఉగ్రవాదాన్ని, స్మగ్లింగ్ ని అడ్డుకునేందుకు వాడే పరికరాలను కూడా ప్రేరేపిస్తాయి.దీంతో, కొమ్ముల అక్రమ రవాణాను గుర్తించడం, ఆపడం సులభం అవుతుంది.

Advertisement

బ్లాక్ మార్కెట్‌లో ఖడ్గం మృగాల కొమ్ముల ధర బంగారం, ప్లాటినం, వజ్రాలు, కొకైన్‌ కంటే ఎక్కువ! దక్షిణాఫ్రికాలో ప్రతి 20 గంటలకు ఒక ఖడ్గ మృగాన్ని చంపేస్తున్నారు.ఈ దారుణాని ఆపే జోహన్నెస్‌బర్గ్‌లోని విట్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ( Scientists at Wits University in Johannesburg )కొత్త పద్ధతిని ప్రయోగిస్తున్నారు.

జేమ్స్ లార్కిన్ ( James Larkin )అనే శాస్త్రవేత్త నాయకత్వంలో జరుగుతున్న ఈ పరిశోధనలో, ఖడ్గమృగాలని మత్తులో ఉంచి వాటి కొమ్ముల్లో రేడియోధార్మిక పదార్థాన్ని చొచ్చిస్తున్నారు.ఈ పదార్థం చైనా సంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు, కానీ ఇది మనుషులకు హాని కలిగించదు.ఈ విధంగా మార్చిన కొమ్ములు అక్రమ రవాణాకు పనికిరాకుండా పోతుంది.

ఎందుకంటే, ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఉండే యంత్రాలు వాటిని గుర్తించగలవు.ఇప్పటివరకు 20 కొమ్ములపై ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఫలితాలు బాగున్నాయి కాబట్టి, ఈ పద్ధతిని ఏనుగుల వంటి ఇతర జంతువులను కాపాడటానికి కూడా వాడాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మండిపోతోన్న అమెరికా.. మరీ ఈ రేంజులో ఉష్ణోగ్రతలా..?
Advertisement

తాజా వార్తలు