ఎలాంటి డైట్ అక్కర్లేదు.. రోజు ఉదయం ఈ డ్రింక్ తాగితే అధిక బరువుకి బై బై చెప్పొచ్చు!

ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మంది అధిక బరువు( Overweight ) సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువు కారణంగా ఇష్టమైన దుస్తులు వేసుకోలేరు.

పైగా ఇరుగు పొరుగు వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ మరింత మదన పెడుతుంటాయి.అలాగే అధిక బరువు శరీర ఆకృతిని దెబ్బతీయడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.

అందుకే ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ బరువును అదుపులో ఉంచుకోవాలని చెబుతుంటారు.ఈ క్రమంలోనే చాలా మంది కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ( Weight Loss Drink ) తాగితే ఎలాంటి డైట్ అక్కర్లేదు.అధిక బరువు సమస్యకి సులభంగా బై బై చెప్పవచ్చు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక లెమన్ ను ( Lemon ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి.

అలాగే కట్ చేసి పెట్టుకున్న లెమన్ పీసెస్ ను కూడా వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన వెయిట్ లాస్ డ్రింక్ సిద్ధం అయినట్టే.రోజు ఉదయం ఈ డ్రింక్ ను తాగితే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

దీంతో క్యాలరీలు కరిగే వేగం పెరుగుతుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రింక్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.ఈ డ్రింక్ ను నిత్యం తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ తో పాటు మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.

Advertisement

బాడీ డీటాక్స్ అవుతుంది.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.

గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి దరిచేరకుండా ఉంటాయి.డిప్రెషన్ తలనొప్పి వంటి సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి కూడా ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.

తాజా వార్తలు