కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గo.జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహం ఆవిష్కరించిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య.
ఈరోజు సాయంత్రం బీసీ సంఘం సభ్యులు ఆర్ కృష్ణయ్య( R.Krishnaiah ) ను ఏలూరు రోడ్ లోనీ నాగవరప్పాడు నుండి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై క్రొత్త మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్దకు ర్యాలీగా తీసుకొని వచ్చారు.ఈ ర్యాలీలో కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ, మరో ఎమ్మెల్సీ యేసు రత్నం, ఎమ్మెల్యే కొడాలి నాని లు పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు.
అనంతరం కొత్త మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జయ మంగళ వెంకటరమణ మాట్లాడుతూ బీసీలను గుర్తించి అధిక ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు( Chandra babu naidu ) బీసీలను అణగదొక్కడమే కాకుండా బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదని అన్నారు.చంద్రబాబు తన పర్యటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బ్యానర్లను చూసి ఎద్దేవా చేశారని, ప్రస్తుతం 74 సంవత్సరాలు వయసులో ఉన్న చంద్రబాబుకు చివరి రోజులు దగ్గరకు వచ్చాయని, ఆయనకు అనేక సంవత్సరాలు పాలేరుగా పనిచేసిన నేనే చంద్రబాబుకు బ్యానర్లు కడతానని అన్నారు.
ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలంతా కలిసికట్టుగా ఉండటం వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్లమెంటులో బీసీల వాణిని మరింత వినిపించేందుకు నాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని, జగన్ ఆశయాలను అందరం కలిసికట్టుగా నెరవేర్చాలని అన్నారు.ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని గుడివాడలో బీసీలకు ఇచ్చే పదవికి తాను అడ్డంకిగా ఉండనని, అవసరమైతే తప్పుకుంటానని అన్నారు
.