టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల షూటింగ్‌ను మొదలెట్టిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయినట్లు చిత్ర వర్గాల్లో వార్తలు జోరుగా వినిపించాయి.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ వార్తలన్నీ కేవలం రూమర్లేనని, ఇంకా ఈ సినిమా హక్కులకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమా రైట్స్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు తెలిపారు.
ఇక ప్రస్తుతం షూటింగ్ మాత్రమే జరుపుకుంటున్న ఈ సినిమా హక్కులకు గురించి ఏదైనా డీల్ జరిగితే చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటిస్తుందని వారు తెలిపారు.కాగా ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy