ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ వర్ధంతి వేడుకలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:బహుజన విప్లవ వీరుడు, గోల్కొండ కోటను జయించిన ధీరుడు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 313 వ వర్ధంతి వేడుకలను తుర్కపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మారగొని శ్రీరామమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

 Sardar Sarvai Papanna Gaud Maharajs Birthday Celebrations ,sardar Sarvai Papanna-TeluguStop.com

ఈ సందర్భంగా పాపన్న ఆశయ సాధనకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పలువురు గౌడ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.అంతకు ముందు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం అధికారికంగ నిర్వహించిన కార్యక్రమంలో తహశీల్దార్ బ్రహ్మయ్య పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆయా కార్యక్రమాల్లో మాజీ జెడ్పిటీసీ సభ్యుడు రంగ శంకరయ్య గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మి నారాయణ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్,బీజేపీ జిల్లా నాయకుడు దొంకేన రాజు గౌడ్,కల్లు గీత కార్మిక సంఘం నాయకులు, కొక్కొండ నర్సింలు గౌడ్, పాముల నర్సింలు గౌడ్, దొంకెన కిష్టయ్య గౌడ్, పాముల రాజు గౌడ్,పాల జమ్మయ్య గౌడ్,కొండం బాలయ్య గౌడ్,కరే ఉపేందర్ గౌడ్,బాగమ్మల వెంకటేష్ గౌడ్,తునికి క్రిష్ణ మూర్తి గౌడ్,దోంకేన రాజు గౌడ్,పాముల బాలకృష్ణ గౌడ్,తుణికి మల్లికార్జున్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube