యూఎస్: మరో భారతీయురాలికి కీలక పదవి.. ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేసిన బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ తన టీంలో భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వెళుతున్నారు.

భారతీయుల సామర్ధ్యంపై నమ్మకం వుంచిన అమెరికా అధ్యక్షుడు ముఖ్యమైన విభాగాలకు అధిపతులుగా మనవారినే నియమిస్తున్నారు.

తాజాగా ఇండియన్-అమెరికన్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సరళా విద్యా నాగాలాను కీలక పదవికి అధ్యక్షుడు నామినేట్ చేశారు.కనెక్టికట్‌ రాష్ట్రానికి ఫెడరల్‌ జడ్జిగా సరళను ప్రతిపాదించారు.

నాగాలాతో పాటు, మరో నలుగురు కొత్త అభ్యర్థులను ఫెడరల్ శాఖకు, ఇద్దరిని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టులకు బైడెన్ నామినేట్ చేశారు.అమె నియామకం ఖరారైతే.

దక్షిణాసియాకు చెందిన తొలి ఫెడరల్‌ జడ్జి అవుతారు.సరళా ప్రస్తుతం కనెక్టికట్‌ జిల్లాలోని యుఎస్‌ అటార్నీ కార్యాలయంలో మేజర్‌ క్రైమ్స్‌ యూనిట్‌కు డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.2017 నుండి ఆమె ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.2012లో యుఎస్‌ అటార్నీ కార్యాలయంలో చేరిన ఆమె.హేట్‌ క్రైమ్స్‌ కోఆర్డినేషన్‌ సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు.2008లో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో బర్కిలీ స్కూల్‌ ఆఫ్‌లాలో జ్యూరిస్‌ డాక్టర్‌ డిగ్రీని పొందిన సరళ 2009లో జడ్జి సుషాన్‌ గ్రాబేర్‌ వద్ద క్లర్క్‌గా వ్యవహరించారు.దేశంలోని న్యాయస్థానాలు వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయని అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ ఒకానొక సందర్భంలో అన్నారు.

Advertisement

అందుకు తగ్గట్టుగానే ఆయన నియామకాలు చేస్తూ వస్తున్నారు.తాజాగా కనెక్టికట్ ఫెడరల్ బెంచ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టులకు సరళతో పాటు ఇతర నామినేషన్ల ఈ లక్ష్యానికి అనుగుణంగా జరిగినవేని నిపుణులు చెబుతున్నారు.

కొద్దిరోజుల క్రితం అమెరికాలో మొట్టమొదటి ముస్లిం–అమెరికన్‌ ఫెడరల్‌ జడ్జిగా పాకిస్తాన్‌ సంతతికి చెందిన జాహిద్‌ ఖురేషీ (46) నియమితులయ్యారు.న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఆయన న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు.ఖురేషీ ఎంపిక కోసం జరిగిన ఓటింగ్‌ సందర్భంగా సెనెట్‌ 81–16 ఓట్లతో ఆమోదం తెలిపింది.

ఈ ఓటింగ్‌లో దాదాపు 34 మంది రిపబ్లికన్లు డెమొక్రాట్లకు మద్ధతుపలకడం గమనార్హం.దీనిపై సెనెటర్‌ రాబర్ట్‌ మెనెండెజ్‌ స్పందిస్తూ.ఖురేషీ దేశానికి సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నారని కొనియాడారు.

ఆయన నియామకం ద్వారా అమెరికాలో ఏదైనా సాధ్యమే అని మరోసారి రుజువైందన్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు