సంతోష్ శోభన్ సినిమా రిలీజ్ ముందే లాభాలు..!

యువి కాన్సెప్ట్ బ్యానర్ లో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం.ప్రియా భవాని శకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.

 Santosh Sobhan Movie Profits With Kalyanam Kamaniyam , Kalyanam Kamaniyam, Priya-TeluguStop.com

ఈ సినిమాకు రిలీజ్ కు ముందే లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది.సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడవగా వాటి ద్వారా 7 కోట్ల దాకా వచ్చినట్టు టాక్.

సినిమా బడ్జెట్ మొత్తం అక్కడే కవర్ అవడమే కాదు లాభం కూడా వచ్చినట్టు తెలుస్తుంది.ఇక థియేట్రికల్ రన్ లో ఎంత వచ్చినా అది బోనస్ అన్నమాట.

యువి వారి ఈ ప్లాన్ భలేగా ఉంది.సంతోష్ శోభన్ తో వారు అందుకే వరుస సినిమాలు చేస్తున్నారు.ఇక కళ్యాణం కమనీయం సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.పెళ్లి తర్వాత వ్యక్తి జీవితంలో జరిగే మార్పులను సినిమాలో చూపించారు.

కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది.సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ ల జోడీ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. మరి ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube