Prem Kumar Review: ప్రేమ్ కుమార్ రివ్యూ: ప్రేమ్ కుమార్ గా సంతోష్ శోభన్ కు కలిసొచ్చిందా?

డైరెక్టర్ అభిషేక్ మహర్షి దర్శకత్వంలో రూపొందిన సినిమా ప్రేమ్ కుమార్.

( Prem Kumar Movie ) ఈ సినిమాలో సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీవిద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు నటించారు.

ఇక ఈ సినిమా మంచి కామెడీ నేపథ్యంలో రూపొందగా ఈ సినిమాకు శివప్రసాద్ పన్నీరు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.ఎస్.అనంత్ శ్రీకర్ సంగీతం అందించగా.రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కొన్ని లుక్స్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.పైగా ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడుగా పరిచయమవుతున్నాడు రచయిత అభిషేక్ మహర్షి.

అయితే హీరో సంతోష్ శోభన్ కు,( Santosh Shoban ) డైరెక్టర్ అభిషేక్ మహర్షికి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో ఇప్పుడు చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో సంతోష్ శోభన్, రాశి సింగ్.

Advertisement
Santosh Shoban Rashi Singh Ruchitha Sadineni Prem Kumar Movie Review Rating-Pre

ప్రేమ్ కుమార్,( Prem Kumar ) నేత్ర( Netra ) అనే పాత్రలో కనిపిస్తారు.అయితే పెళ్లి మండపంలో ఉన్న ప్రేమ్ కుమార్, నేత్రల పెళ్లి మరి కాసేపట్లో జరుగుతుందన్న సమయంలో అక్కడికి రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు.

తను, నేత్ర ప్రేమించుకున్నామని.పెళ్లి చేయమని అందరి ముందు నేత్ర తల్లిదండ్రులతో కోరుతాడు.

దాంతో నేత్ర తండ్రి రాజ్ మాదిరాజు( Raj Madiraju ) వెంటనే ఓకే అని నేత్రను ఇచ్చి తనతో పంపించేస్తాడు.అయితే ప్రేమ్ కుమార్ మరో పెళ్లికి సిద్ధమవుతాడు.

కానీ ఆ పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుంది.ఇప్పటికీ ఆయనకు ఎన్నో పెళ్లి చూపులు కూడా అవుతాయి.

Santosh Shoban Rashi Singh Ruchitha Sadineni Prem Kumar Movie Review Rating

కానీ అందులో ఏ ఒక్కటి కూడా వర్కౌట్ కాకపోవటంతో.ఇక తనకు పెళ్లి అవ్వట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ తో తన ఫ్రెండ్ సుందర్ లింగం (కృష్ణ తేజ) తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు.అయితే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే.

Advertisement

ప్రేమ, పెళ్లి జంటలను విడగొట్టడం.ఇక వాటి ద్వారా వాళ్లకు డబ్బులు బాగా రావడంతో హ్యాపీగా లైఫ్ను కొనసాగిస్తూ ఉంటారు.

ఇక అదే సమయంలో ప్రేమ్ కుమార్ కు నేత్ర అడ్డుపడుతుంది.మరి ప్రేమ్ కు ఎందుకు అడ్డుపడుతుంది.

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన రోషన్( Roshan ) నేత్రను కాకుండా అంగనా (రుచితా సాధినేని) ను( Ruchita Sadhineni ) ఎందుకు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతాడు.మరి నేత్ర ఏం చేస్తుంది.

ప్రేమ్ కుమార్ చివరికి ఏం చేస్తాడు అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

నటీనటుల విషయానికి వస్తే.సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్ పాత్రలో అద్భుతంగా లీనమయ్యాడు.ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా ప్రేక్షకులను కనెక్ట్ చేశాడు.

రుచితా కూడా బాగానే పర్ఫామెన్స్ చేసింది.ఇక కొంతమంది నటులు నవ్వించే ప్రయత్నం బాగా చేశారు.

మిగిలిన నటీనటులంతా కొంతవరకు పరవాలేదు అన్నట్లుగా నటించారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.తొలిసారి డైరెక్టర్ గా అభిషేక్ మహర్షి( Abhisek Maharshi ) కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.అనంత్ శ్రీకర్ అందించిన సంగీతం కూడా బాగుంది.

మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

సినిమా మంచి కంటెంట్ అని చెప్పాలి.పైగా డైరెక్టర్ ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడుగా పరిచయం అయ్యాడు కాబట్టి కొంతవరకు సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించే ప్రయత్నం చేశాడు.కాస్త ఎమోషనల్ సన్నివేశాలలో మరింత కనెక్ట్ అయ్యే విధంగా రాసుకుంటే సినిమా మరింత అద్భుతంగా ఉండేదని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ, మ్యూజిక్, నేపథ్య సంగీతం, నటీనటుల పర్ఫామెన్స్.

మైనస్ పాయింట్స్:

కొన్ని ఎమోషనల్ సీన్స్ మరింత కనెక్ట్ అయితే బాగుండేది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే సినిమా కథ ఒకింత బాగుందని చెప్పాలి.ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా సంతోష్ శోభన్ కు కొంత సక్సెస్ ఇచ్చింది అని చెప్పవచ్చు.

కాబట్టి ఒకసారి చూస్తే సరిపోతుంది.

రేటింగ్: 2.75/5

తాజా వార్తలు