సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట చేతికి వచ్చిన సందర్భంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన భారతీయులు కూడా ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకున్నారు.
ఈ పెద్ద పండుగను ఖతర్లోని ఆంధ్ర కళావేదిక వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించారు.తెలుగు నేపథ్య గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పలుకు తోడుగా సత్యభామ స్వాతి, ప్రముఖ జానపద గాయకురాలు శిరీష, డ్యాన్స్ ఢీ షో ఫేమ్ డాన్స్ మాస్టర్ పండు, మాధురీ తమ పాటలతో, ఆటలతో, మాటలతో ప్రేక్షకులను మైమరిపించారు.

ప్రముఖ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖాదర్లోని భారత రాయబార కార్యాలయం నుంచి విచ్చేసిన కార్యదర్శి సచిన్ దినాకర్ సంకల్ప్ మాట్లాడుతూ భాష, కళా, సంస్కృతిక సేవ రంగాలలో చేసిన కృషికి ఆంధ్ర కళావేదిక కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.వినోద్ నాయక్ ప్రెసిడెంట్ ఇండియన్ కమ్యూనిటీ ఫోరం కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి ఇండియన్ కల్చరల్ సెంటర్ మెడికల్ అసిస్టెంట్ హెడ్ రజనీ మూర్తి, సలహా మండలి చైర్మన్ సత్యనారాయణ, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు శ్రీనివాస్ గద్దె, హరీష్ రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేశారు.

ఆంధ్ర కళావేదిక అధ్యక్షురాలు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని సమయ భావాన్ని కూడా లెక్కచేయకుండా ప్రేక్షకులు కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారని వెల్లడించారు.ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రం సుఖవాసి, విబికే మూర్తి, సుధా, సోమరాజు, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, శిరీష రామ్ బృందం చేసిన కృషి అభినందనీయమని వెల్లడించారు.ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రం సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలుతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ముగిసిపోయింది.







