వావ్... సానియా మీర్జా ఈజ్ బ్యూటిఫుల్...

ఒకప్పుడు భారతదేశానికి టెన్నిస్ ఆటలో ఎన్నో మెడల్స్ అందించినటువంటి స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి తెలియని వారుండరు.

అయితే  కెరియర్ లో బాగానే రాణిస్తున్న సమయంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు.

అనంతరం కొద్ది రోజులు ఆటని కొనసాగించినప్పటికీ ఆ తర్వాత గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.దీంతో గత కొద్ది సంవత్సరాలుగా ఈ అమ్మడు ఆట కి దూరంగా ఉంటోంది.

అయితే మళ్లీ చాలా కాలం తర్వాత టెన్నిస్ ఆటలో పాల్గొనేందుకు ఈ అమ్మడు తీవ్రంగా శ్రమిస్తోంది.పెళ్లయి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత దాదాపుగా 90 కేజీల వరకు బరువు పెరిగింది.

దాంతో తన బరువు తగ్గించుకుని ఫిట్నెస్ పెంచుకునేందుకు ఈ అమ్మడు నాలుగు నెలలపాటు బాగానే శ్రమించి దాదాపుగా 20 కేజీల వరకు బరువు తగ్గింది.అంతేగాక ఈ స్లిమ్ ఫోటోలను ప్రస్తుతం సానియా మీర్జా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన అభిమానులతో పంచుకుంది.

Advertisement

అంతేకాక ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాల కోసం శ్రమించాలని మరియు ఇందులో ఎక్కువగా నిరాశకు గురి చేసే వాళ్లే ఉంటారని కాబట్టి వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని సూచించింది.

ఈ పోస్ట్ పై పలువురు సెలబ్రిటీల స్పందిస్తూ తూ అభినందనలు తెలుపుతున్నారు.ఇందులో ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు తదితరులు ఉన్నారు.అంతేగాక సానియామీర్జా మళ్లీ తన ఆట కోసం ఇంతలా శ్రమిస్తుండటం చూసి  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు