ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీని ఆపాలని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు.దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో ఇసుక కుంభకోణం జరుగుతుందని ఆయన ఆరోపించారు.
సీఎం జగన్ తన మనుషులకు జిల్లాల వారీగా భాగాలు పంచారని ధ్వజమెత్తారు.వైసీపీ నేతలు ఇసుక కుంభకోణంతో రూ.వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.ఏపీలో ఇసుక నుంచి మద్యం వరకు కుంభకోణాలు జరుగుతుంటే కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
ఇప్పటికైనా నిఘా సంస్థలు ప్రత్యేక దృష్టి సారించి స్కాంలను కట్టడి చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.