మూవీ ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో తరచూ ఎవరో ఒక సెలబ్రిటీ క్యాస్టింగ్ కౌచ్( Casting Couch ) గురించి మాట్లాడుతూనే ఉంటారు.

ఇప్పటికే ఈ విషయంపై ఎంతోమంది టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే.

కొంతమంది మీడియా ముందు పేర్లతో సహా చెప్పేయగా మరి కొంతమంది పేర్లు చెప్పకుండా వారు ఎదుర్కొన్న బాధలు గురించి మాత్రమే తెలిపారు.అలా సినిమా ఇంట్రెస్ట్ లో ఎవరు ఒకరు ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు.

తాజాగా న‌టి, బిగ్ బాస్ బ్యూటీ స‌న‌మ్ షెట్టి( Sanam Shetty ) కూడా ఈ ఇష్యూపై మాట్లాడింది.సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.ఒక ఆడపిల్ల అనుమతి లేకుండా తాకడానికి ఎవరికీ అధికారం లేదు.అలాగే నేను ఒక నటిని ఎంటర్‌టైన్‌ చేయడమే నా వృత్తి.

Advertisement

అలాగని ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనంటూ సనమ్ శెట్టి వివాదాస్పద వాఖ్యలు చేసింది.దీంతో సనమ్ వాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

‌ ఆమె అంటున్న మాటలను బట్టి సినిమాల్లో ఆఫర్స్ లభించిన హీరోయిన్స్ అంతా శరీరాలను సమర్పించుకున్నట్లే వస్తుందని అంటున్నారు.మరి ఈ ట్రోల్స్( Trolls ) పై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

కాగా కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మంత్రం ఆమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇకపోతే సనమ్ శెట్టి విషయానికి వస్తే ఏమి తెలుగు తమిళ భాషల సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.2012లో త‌మిళంలో వ‌చ్చిన అంబులి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.మిస్ సౌత్ ఇండియా సనమ్ శెట్టి ఆ త‌ర్వాత త‌మిళంలో పాతిక సినిమాల వ‌ర‌కు చేసింది.

కానీ కెరీర్ పరంగా పెద్దగా కలిసి వచ్చిందేమీ లేదు.ఇక తెలుగులో మ‌హేశ్ బాబు శ్రీమంతుడులో( Srimanthudu ) ఒక చిన్న క్యారెక్ట‌ర్‌తో పాటు సంపూర్ణేశ్ బాబు సింగం 123, బిగ్‌మాస్ మాన‌స్ హీరోగా వ‌చ్చిన‌ ప్రేమికుడు సినిమాల్లో హీరోయిన్‌ గా కూడా చేసింది.

ఆ సినిమాకి డైరెక్టర్ విఠలాచార్య అనుకున్నారు.. రాఘవేంద్రరావుకి మతిపోయింది..?
విశ్వంభర నుంచి సర్ప్రైజ్ వచ్చేసింది.. మెగాస్టార్ చిరంజీవి లుక్ అదిరిపోయిందిగా!

ప్రస్తుతం ఈమె కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు