నేను మందు తాగుతా... అయితే ఏంటీ... పవన్ చెల్లి మామూల్ది కాదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సంయుక్త మీనన్ ( Samyuktha Menon )ఒకరు.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో  రానాకు జోడిగా పవన్ కళ్యాణ్ కు చెల్లెలు పాత్రలో నటి సంయుక్త మీనన్ నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె అనంతరం బింబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

Samyuktha Menon Open Up Drinking Alcohol, Samyukta Menon, Alcohol, Akhanda 2, To

ఇక ప్రస్తుతం ఈమె బింబిసారా 2, నిఖిల్ స్వయంభు, బాలకృష్ణ అఖండ 2 వంటి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా సంయుక్త తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తనకు ఉన్నటువంటి ఒక చెడు అలవాటు గురించి బయటపెట్టారు.

అందరిలాగే తాను కూడా మందు ( Alcohol )తాగుతాను అంటూ ఈమె తనకు మందు తాగే అలవాటు ఉందని ఓపెన్ గా చెప్పేసారు.

Samyuktha Menon Open Up Drinking Alcohol, Samyukta Menon, Alcohol, Akhanda 2, To
Advertisement
Samyuktha Menon Open Up Drinking Alcohol, Samyukta Menon, Alcohol, Akhanda 2, To

తనకు మందు తాగే అలవాటు ఉందని అదే పనిగా మందు తాగుతూ కూర్చొనని, నేను ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు,టెన్షన్స్ ఎక్కువైనప్పుడు మాత్రమే కొంచెం తీసుకుంటా అంటూ తనకు మందు తాగే అలవాటు ఉందనే విషయాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సాధారణంగా చాలామంది హీరోయిన్స్ కి ఇలా మందు తాగే అలవాటు ఉంది కానీ వాటి గురించి ఎవరు కూడా బయట పెట్టుకోలేదు కానీ ఈమె మాత్రం ఇలా మందు తాగుతాను అంటూ ఓపెన్ గా చెప్పడంతో ఈమె అభిమానులు అలాగే నేటిజన్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈమె తెలుగులో చివరిగా సార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ డిసిజన్స్ మారిపోయాయా..?
Advertisement

తాజా వార్తలు