రూ.పదివేల లోపు ధరతో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయిన శామ్‌సంగ్ ఫోన్( Samsung Mobile ) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.
తాజాగా ఫ్లిప్‌కార్ట్ 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా ఉన్న 4G శామ్‌సంగ్ ఫోన్‌ను కేవలం పదివేల లోపే విక్రయించడం మొదలుపెట్టింది.ఆ ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.
అలానే ఇది కొనుగోలు చేయొచ్చా లేదా అనే సంగతి కూడా తెలుసుకుందాం.
గతేడాది శామ్‌సంగ్ గెలాక్సీ F13( Samsung Galaxy F13 ) స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.11,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.అయితే, ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత ఇది రూ.9,199కే లభిస్తోంది.అంటే ఇక్కడ కస్టమర్లకు రూ.2,800 భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు.ఈ ధరతో శామ్‌సంగ్ గెలాక్సీ F13 64GB వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు.అదే సమయంలో, ఫోన్ 128జీబీ వేరియంట్ భారతదేశంలో రూ.12,999 ప్రారంభ ధరతో రిలీజ్ అయింది.

ఇప్పుడు ఈ ఫోన్ 128GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో( Flipkart ) రూ.10,199కే దొరుకుతోంది.ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌లతో పాటు, కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.ఈ ఫోన్ బ్లూ, కాపర్, గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే, బ్యాక్ సైడ్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, ఫోటోగ్రఫీ కోసం 2MP డెప్త్ సెన్సార్ అందించారు.

సెల్ఫీల కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ లో 8MP కెమెరా ఆఫర్ చేశారు.గెలాక్సీ F13 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లే, ఎక్సీనోస్ 850 ప్రాసెసర్‌తో వస్తుంది.దీని బ్యాటరీ 6000mAh కాగా మామూలు యూజర్లు రెండు రోజుల బ్యాక్అప్ పొందవచ్చు.ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.గేమ్స్ కాకుండా సినిమాలు చూడాలనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది, అలాగే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నావిగేషన్ కోసం ఫోన్ వాడే డెలివరీ బాయ్స్, మొబైల్లో వర్క్ చేసే వారికి ఇది ఉత్తమంగా నిలుస్తుంది.







