తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వరుస సినిమాను చేస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు.ఇక ఇలాంటి సమయంలోనే 15 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంపత్ నంది( Sampath Nandi ) మాత్రం వరుస సినిమాలు చేసిన కూడా ఆయనకి ఏ సినిమాలు కూడా కలిసి రావడం లేదనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఆయన సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) తో గాంజా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కూడా బడ్జెట్ ప్రాబ్లం వల్ల మధ్యలోనే ఆగిపోవడం అనేది ఆయనకు భారీ దెబ్బను కల్గించే విషయం అనే చెప్పాలి.
ఇక దానితో ప్రస్తుతం ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నా ఒక అబ్బాయిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఆయనే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఓదేల రైల్వే స్టేషన్( Odela Railway Station ) కి సీక్వెల్ గా ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో తమన్నా( Tamannaah ) హీరోయిన్ గా నటిస్తుంది.అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయడం విశేషం.ఇక తొందరగా ఈ సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేసి ఆలోచనలో సంపత్ నంది ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ప్రస్తుతం ఆయన సినిమాలను చేసే క్రమంలోనే చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఆయనతో పాటు దర్శకులు అయిన చాలామంది ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతుంటే ఈయన మాత్రం ఇంకా మీడియం రేంజ్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నాడు.ఇక ఈయన కెరియర్ లో ఒక సక్సెస్ కూడా లేదు అన్ని ఆవ సినిమాలే ఉండడం వల్ల ఈయనతో సినిమా చేయడానికి హీరోలుగానీ, ప్రొడ్యూసర్లు కానీ అందరి వెనకడుగు వేస్తున్నారనే చెప్పాలి.చూడాలి మరి ఓదెల రైల్వే స్టేషన్ 2 సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.