ఒకే కథతో ప్రభాస్, కార్తీ సినిమాలు.. ఆ సినిమాల రిజల్ట్ ఏంటంటే?

సినిమా ఇండస్ట్రీలో ఒకే తరహా కథలతో తెరకెక్కి సక్సెస్ సాధించిన సినిమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకే తరహా కథలతో తెరకెక్కి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు సైతం అదే విధంగా ఉన్నాయి.అయితే ప్రభాస్, కార్తీ నటించిన సినిమాలు దాదాపుగా ఒకే కథతో తెరకెక్కగా ఈ సినిమాలలో ప్రభాస్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటే కార్తీ సినిమా హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

 Same Story For Prabhas And Karthi Movies Results Details Here , Karthi,prabhas,prabhas And Karthi Movies,prabhas Fans,vamsi Paidipalli,munna Movie, Ileana,veeraman Movie-TeluguStop.com

ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన మున్నా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ రోజు పాజిటివ్ టాక్ వచ్చినా టాక్ కు అనుగుణంగా కలెక్షన్లు రాలేదు.

కథ, కథనంలోని చిన్నచిన్న లోపాల వల్ల ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.

 Same Story For Prabhas And Karthi Movies Results Details Here , Karthi,Prabhas,prabhas And Karthi Movies,Prabhas Fans,Vamsi Paidipalli,Munna Movie, Ileana,Veeraman Movie-ఒకే కథతో ప్రభాస్, కార్తీ సినిమాలు.. ఆ సినిమాల రిజల్ట్ ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Ileana, Karthi, Munna, Prabhas, Prabhas Karthi, Prabhas Fans, Veeraman-Movie

అయితే మున్నా విడుదలైన 16 సంవత్సరాల తర్వాత దాదాపుగా అదే తరహా కథతో కార్తీ హీరోగా వీరుమాన్ అనే సినిమా తెరకెక్కి తమిళంలో విడుదలైంది.సాధారణంగా కార్తీ సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతూ ఉంటాయి.అయితే ఈ సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది.తమిళంలో వీరుమాన్ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.

Telugu Ileana, Karthi, Munna, Prabhas, Prabhas Karthi, Prabhas Fans, Veeraman-Movie

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ హీరో సినిమా పాయింట్ ను తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారని కామెంట్లు చేస్తున్నారు.తమిళంలో శంకర్ కూతురు అదితి ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించగా ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.తెలుగులో సక్సెస్ సాధించని కథ తమిళంలో సక్సెస్ ను సొంతం చేసుకుందంటే ఒకింత ఆశ్చర్యమే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube