టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు.
అయితే మొన్నటి వరకు కెరియర్ పరంగా బిజీగా గడిపిన సమంత ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొద్ది నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది సమంత.
ఈ మేరకు ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ ను కూడా చేసిన విషయం తెలిసిందే.గతంలోనే అంగీకరించిన సిటాడెల్ ( Citadel Web Series )అనే వెబ్‌సిరీస్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఈ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సమయంలో ఒకసారి స్పృహతప్పి పడిపోయారు కూడా.దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది మళ్లీ ఆ వెబ్ సిరీస్‌ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం.కాగా త్వరలోనే తాను నటించే కొత్త చిత్రాల వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇలాంటి సమయంలో ఇటీవల ఆమె ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో విడుదల చేసింది.
మరో టాలీవుడ్ హీరోయిన్ అయిన సాయిపల్లవి( Sai Pallavi )ని పొగడ్తలతో ముంచెత్తారు.సాయిపల్లవి మంచి డాన్సర్ అన్న విషయం నాకు తెలుసు.గతంలో ఆమె పాల్గొన్న డాన్స్ కార్యక్రమం పోటీలకు నేను జడ్జిగా కూడా వెళ్లాను.
అప్పుడు సాయి పల్లవి డాన్స్‌ను చూసి దృష్టి పక్కకు తిప్పు కోలేక కళ్లప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయాను అని చెప్పుకొచ్చింది సమంత.ఇకపోతే సాయి పల్లవి నాగచైతన్య ప్రస్తుతం తండేల్( Thandel ) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.
సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.