సమంత డివోర్స్ టాపిక్ కరణ్ జోహార్ షోకు ఎంతగా కలిసొచ్చిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన ఫోకస్ ని మొత్తం సినిమాల పైన పెట్టింది.

కాగా విడాకుల తరువాత సమంత కెరియర్ డల్ అవుతుంది అని అందరూ భావించినప్పటికీ, ఊహించిన విధంగా విడాకుల తర్వాతనే సమంతకు మరిన్ని అవకాశాలు రావడం ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

కాగా సమంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ పై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.కాగా ఇప్పటికే బాలీవుడ్ లో రెండు మంచి మంచి ఆఫర్లను అందుకోగా తాజాగా మరొక భారీ బడ్జెట్ సినిమాలో నటించడం కోసం సిద్ధపడినట్టుగా తెలుస్తోంది.

ఇక ఇది ఇలా ఉంటే ఇటీవలే ఆమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.సమంత విడాకుల విషయంతో నిర్మాత కరణ్ జోహార్ కు మంచి లాభాలు అందినట్లు తెలుస్తోంది.

అయితే సమంత,నాగచైతన్య ఇద్దరు అలా విడిపోవడానికి అసలు కారణం ఏమిటి అనేది ఎవరికి అంతు చిక్కలేదు.అయితే ఆ విషయం గురించి ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సమంత క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

వారిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు కెరీర్ పరంగా వాళ్ళు బిజీబిజీగా మారిపోయారు.నాగచైతన్య కూడా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు.

అయితే సమంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పాగ వేసుకోవడానికి బాగానే ప్రయత్నిస్తోంది.ఇక పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ను అందుకుంది.

కాగా ఇటీవల కరణ్ జోహార్ సమంత విడాకుల విషయంపై ప్రశ్నలు వేయడంతో కాఫీ విత్ కరణ్ షో మంచి క్రేజ్ అందుకుంది.ఎందుకంటే అప్పటివరకు సమంత ఎప్పుడు కూడా తన విడాకుల విషయంపై పెద్దగా స్పందించింది లేదు.కానీ మొదటిసారిగా కరణ్ షోలో సమంత ఆ విషయం గురించి మాట్లాడటంతో ఒక్కసారిగా టాక్ షోకు భారీ స్థాయిలో వ్యూవ్స్ అయితే వచ్చాయి.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కాఫీ విత్ కరణ్ షోకు అటువంటి స్థాయిలో వ్యూస్ దక్కనట్లుగా తెలుస్తోంది.ఒక విధంగా కరణ్ జోహార్ తన టాక్ షోకు సమంత విడాకుల విషయాన్నీ బాగానే వాడుకున్నట్లు అర్థమవుతుంది.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

ఆ విడాకుల విషయమే కోట్లల్లో వ్యూవ్స్ అయితే అందిస్తున్నట్లు సమాచారం.కరణ్ జోహార్ అక్షయ్ కుమార్ సమంతను ఇంటర్వ్యూ చేయడానికి ప్రత్యేకంగా ఒక కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇటీవల వీరిద్దరూ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

తాజా వార్తలు