సమంత 'చెన్నై స్టోరీస్‌'... ఆ విషయమై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

సమంత ( Samantha ) ఇటీవల ఒక ఇంగ్లీష్ మూవీకి ఓకే చెప్పింది.అది హాలీవుడ్‌ మూవీ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

 Samantha New Film Chennai Story Interesting Update Details, Chennai Story, Saman-TeluguStop.com

ఆ విషయంలో మాకు అందిన సమాచారం ప్రకారం ఇంగ్లీష్‌ మూవీనే కానీ అది ఒక హాలీవుడ్‌ మూవీ కాదట.ఒక ఇంగ్లాండ్ వ్యక్తి తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుని ఇండియాకు వస్తాడు.

అతడు తన తండ్రికి సంబంధించిన వారిని గుర్తించేందుకు ఇండియాకు చెందిన అమ్మాయి అయిన సమంత హెల్ప్‌ చేస్తుందట.అలా సినిమా కథ సాగుతుందని సమాచారం అందుతోంది.

సినిమా ఎక్కువగా ఇంగ్లాండ్ మరియు తమిళనాడులోని చెన్నైలో జరుగుతుందట.ఇంగ్లాండ్‌ నుండి హీరో చెన్నై కి తన కుటుంబం కు సంబంధించిన మూలాలను తెలుసుకునేందుకు వస్తాడు.

Telugu Chennai Story, Ups, Hollywood, Samantha, Kerala Story-Movie

తమిళ అమ్మాయిగా సమంత నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.సినిమాలో సమంత పాత్ర కాస్త తక్కువే అయినా కూడా కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అయితే సినిమా టైటిల్ ను( Chennai Stories ) చూసి ఇది కేరళ స్టోరీ సినిమా( Kerala Story ) తరహాలో ఒక వివాదాస్పద సినిమా అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Chennai Story, Ups, Hollywood, Samantha, Kerala Story-Movie

కానీ అసలు విషయం ఏంటి అంటే ఈ సినిమా లో అసలు వివాదాస్పద అంశాలు ఉండబోవడం లేదు అంటూ వారు చెబుతున్నారు.ఒక పూర్తి కమర్షియల్‌ సినిమా గా దీన్ని రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.అంతే కాకుండాఆ ఇది ఒక హాలీవుడ్‌ కాన్సెప్ట్‌ అని.తప్పకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా యొక్క ఇంగ్లీష్ వర్షన్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో కొన్ని పాన్ ఇండియా సినిమాలుగా నిలువబోతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube