13 ఏళ్ళ క్రితం సమంత సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఏ మాయ చేసావే సినిమా తో తొలిసారి వెండి తెర పై ఆమె మాయాజాలం మొదలయ్యింది.
ఇదే ఆమెకు తొలి మూవీ మరియు నాగ చైతన్య కి తొలి హిట్ మూవీ కావడం విశేషం.చాల మంది హీరోయిన్స్ లాగ ఆమె గాడ్ ఫాదర్ ఉంటె ఇండస్ట్రీ కి రాలేదు.
ఏ మాయ చేసావే సినిమా కి ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ ఫ్రెష్ లుక్ ఉన్న అమ్మాయి హీరోయిన్ గా కావాలని ఆడిషన్స్ పెడితే ఆ ఆడిషన్స్ కి చాల మంది లాగానే సమంత కూడా వచ్చింది.అక్కడ తన లుక్ నచ్చి గౌతమ్ సమంత కు అవకాశం ఇచ్చాడు.
ఏ మాయ చేసావే సినిమా లో కేరళ క్రిస్టియన్ అమ్మాయి కి, తెలుగు హిందూ అబ్బాయి కి మధ్య లవ్ ట్రాక్ ఉంతుంది.అందుకు తగ్గట్టు గానే సమంత కేరళ మలయాళీ క్రిస్టియన్ కావడం తో పాటు గౌతమ్ రాసుకున్న కథకు సరిగ్గా సరిపోతుంది అని భావించి సమానత ను ఎంచుకున్నాడు.
ఈ సినిమాలో సమంత తన నటనతో అందరిని ఆకట్టుకుంది.ఆమెకు ఇది తొలి సినిమా అనే ఫీలింగ్ ఎక్కడ కనిపించకుండా అద్భుతం గా నటించింది.ఆ సినిమా విజయం సాధించడం తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగు లేని స్థాయికి వెళ్ళింది.

ఆ తర్వాత సమంత ఎన్నో కమర్షియల్ సినిమాల్లో, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ లో నటించింది .ఇక ఫ్యామిలీ మెన్ లాంటి డిజిటల్ సిరీస్ లో కూడా నటించి తన సత్త ఏంటో యావత్ ఇండియా మొత్తం చూపించింది.తనకు తిరుగు లేదు అని చూపించడం తో పాటు తనకు మొదటి సినిమాకు అవకాశం ఇచ్చిన అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్ళింది.
కానీ కొన్ని కారణాల వలన ఈ పెళ్లి వారికి వర్క్ అవుట్ కాలేదు.

దాంతో పర్సనల్ లైఫ్ లో చాల గ్యాప్ వచ్చింది.చాల మందికి సమాదానాలు చెప్పాల్సి కూడా వచ్చింది.ఇక ఇప్పుడు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.
చిన్నతనం లో చదువులో కూడా ముందు ఉండే సమంత ఒకరి మీద ఆధారపడకూడని పాకెట్ మనీ కోసం ఎన్నో పనులు చేసేది.ఒక వైపు చదువు మరో వైపు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ డబ్ సంపాదించేది.
ఆ రకంగానే మాడెలింగ్ లో ప్రవేశించి అక్కడనుంచి హీరోయిన్ గా ఎదిగింది.సమంతకు మెండైన ఆత్మ విశ్వాసం ఉంటుంది.అందుకే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఎక్కడ పడకుండా ప్రయాణం చేస్తుంది.







