Samantha Kushi : ఖుషి కి ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట…..డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే!!

సమంత విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషి( Kushi ). ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.

రొమాంటిక్ అండ్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా దర్శకుడికే కాకుండా హీరో విజయ్ కి హీరోయిన్ సమంత కి కూడా కం బ్యాక్ ఫిలిం అని అంటున్నారు.

విడుదలైన మొదటి రోజే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని అదరగొడుతోంది ఖుషి.రెండు రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్స్ ఓవర్సీస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఖుషి.

Samantha Is Not First Option For Khushi

గీత గోవిందం చిత్రం( Geeta Govindam ) తరువాత ఒక హిట్ సినిమా కూడా లేదు విజయ్( Vijay Deverakonda ) కెరీర్ లో.మళ్ళి విజయ్ ఆ రేంజ్ సక్సెస్ ను ఖుషి తో అందుకున్నాడు.తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు ఈ హీరో.

Advertisement
Samantha Is Not First Option For Khushi-Samantha Kushi : ఖుషి కి �

ఇలాంటి మాట విని 5 సంవత్సరాలవుతోంది అంటూ ట్వీట్ చేసాడు.ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఐతే ఖుషి ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయ్.అబ్దుల్ వాహబ్ మ్యూజిక్, డిఫరెంట్ స్టోరీలైన్, శివ నిర్వాణ దర్శకత్వం, అద్భుతమైన సినిమాటోగ్రఫీ.

కానీ వీటన్నిటికంటే విజయ్ సమంతల కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్.వీళ్ళిద్దరిమధ్య చిత్రీకరించిన లవ్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి.

Samantha Is Not First Option For Khushi

కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం దర్శకుడు శివ నిర్వాణ( Director Shiva Nirvana ) ముందు ఆరాధ్య పాత్రకు సమంత కు బదులు వేరే హీరోయిన్ ని అనుకున్నాడట.ఆమె మరెవరో కాదండి.మన నేషనల్ క్రష్ రష్మిక( Rashmika Mandanna ). కానీ విజయ్ రష్మిక కాంబినేషన్ ఇప్పటికే డియర్ కామ్రాడ్, గీత గోవిందం చిత్రాలలో జనాలు చూసేసారు కాబట్టి ఈ సినిమాకు మళ్ళి వాళ్లనే తీసుకుంటే ప్రేక్షకులు బోర్ అవుతారేమో అని భయపడ్డాడట దర్శకుడు.అందుకే సమంతను అప్రోచ్ అయ్యాడట.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే దర్శకుడి ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఉంది.

Advertisement

తాజా వార్తలు