క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) రష్మిక (Rashmika)హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప(Pushpa).
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఉ అంటావా మావా.
ఊ అంటావా మావా అంటూ సమంత (Samantha) అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.దేవి శ్రీ ప్రసాద్ (Devisri Prasad) అందించిన సంగీత స్వరాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక ఈ పాట దేశ విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకోవడం విశేషం.
ఇప్పటికీ ఈ పాట ఎక్కడైనా వినిపించిన మనకు తెలియకుండానే మన బాడీలో కదలికలు మొదలవుతూ ఉంటాయి.అంతలా ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందనే చెప్పాలి.ఇక ఈ పాట ద్వారా సమంతకు పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని చెప్పాలి.
ఈమె నటించిన ఫస్ట్ స్పెషల్ సాంగ్ ఇలా మంచి గుర్తింపు సంపాదించుకోవడం విశేషం అయితే తాజాగా ఈ పాట సెర్బియా పబ్(Serbia Pub) లో వినిపించడంతో ఒక్కసారిగా సమంత ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం సమంత సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ టీమ్ మొత్తం సెర్బియా వెళ్లారు.అయితే షూటింగ్ సమయంలో విరామం దొరకడంతో నటి సమంత వరుణ్ ధావన్ (Varun Dhavan) ఇతరులు సరదాగా సెర్బియాలోని బెల్ గ్రేడ్ పబ్బుకు వెళ్లారు.అక్కడ సమంత నటించిన ఉ అంటావా మావా.
ఊ అంటావా మావా అనేసాంగ్ ప్లే చేయడంతో సమంత ఒక్కసారిగా ఆశ్చర్యపోవడమే కాకుండా ఈ పాటకు సమంతను డాన్స్ చేయాలని చెప్పడంతో ఆమె మరోసారి ఈ పాటకు డాన్స్ చేస్తూ అందరిని సందడి చేశారు.ఇలా సమంత సెర్బియా పబ్ లో చేసిన ఈ డాన్స్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy